మరో ఎన్‌కౌంటర్..ఇద్దరు మావోయిస్టుల హతం

Another encounter..killed two Maoists

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా భాష కూడా పోలీస్ స్టేషన్ పరిధిలోని నెండ్ర అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఎదురుకాల్పులు చోటుచేసుకున్న చోట ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. ప్రస్తుతం ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు నిన్న ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్‌లో 12 మంది మావోయిస్టుల హతమయ్యారు. అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ భీకర కాల్పుల్లో పోలీసుల చేతిలో 12మంది మావోయిస్టులు మృతి చెందారు. యాంటీ నక్సల్ ఆపరేషన్‌లో భాగంగా చేపట్టిన సెర్స్ ఆపరేషన్‌లో ఏడుగురు నక్సలైట్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున భద్రతా బలగాలకు, మావోయిస్టులకు కాల్పులు జరిగాయి.

ఛత్తీస్ గఢ్‌లోని నారాయణ్ పూర్, దంతెవాడ, జగదల్ పూర్, కొండగావ్ జిల్లాల భద్రతా బలగాలు బస్తర్ పరిధిలో ఉన్న అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా చేపట్టాయి. ఇందులో భాగంగా కూంబింగ్ చేస్తున్న సమయంలో పోలీసుల దళాలపైకి మావోయిస్టులు విరుచుకుపడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

India vs west indies 2023. Gаrmаn асknоwlеdgеѕ thаt hе іѕ аt odds with the board mаjоrіtу. “since, i’ve worn it to cocktail events, and you’d never know it once doubled as a wedding dress ! ”.