అనారోగ్య సమస్యలతో వృద్ధ దంపతులు ఆత్యహత్య

img1

అనారోగ్య సమస్యలతో వృద్ధ దంపతులు ఆత్యహత్య

ఉప్పల్ : ఒకపక్క అనారోగ్య సమస్యలు, మరో వైపు ఉన్న ఒక్క కుమారుడు తమకు దూరంగా ఉండడం, వృధ్యాప్యంలో వచ్చిన సమస్యలు తట్టుకోలేక ఉప్పల్ లో వృద్ధ దంపతులు గుర్తు తెలియని టాబ్లెట్ లు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉప్పల్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్ సాయిరాంనగర్ కాలనీలో నివసించే దుర్వాసుల సూర్యనారాయణశాస్త్రి (60) ఎన్టిపిసిలో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారు. అతనికి భార్య దుర్వాసుల జగదీశ్వరి (54)తోపాటు ఒక కుమారుడు డి.సాయి సుశాంత్ (30) ఉన్నాడు. అతనికి పెళ్లి చేయగా స్టాఫ్ట్వేర్ ఉద్యోగం కారణంగా కోకాపేటలో నివాసం ఉంటున్నాడు. గత కొద్ది రోజులుగా సూర్యనారాయణశాస్త్రి భార్య జగదీశ్వరి అనారోగ్యంతో బాధపడుతోంది. పలు అనుపుత్రులు తిరిగినా నయం కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈనెల 5వ తేది తమ కుమారుడు ఢిల్లీ సెమినార్కు వెళుతున్నట్లు చెప్పినట్లు తెలిపారు. అప్పటి నుంచి వీరి సెల్ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి. వీరి ఇంటికి తాళం వేసి ఉండడంతో ప్రతి రోజు పని మనిషి బయట నుంచే వెళ్ళిపోతోంది. కాగా బుధవారం ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన వస్తుందడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ మాధవరెడ్డి, తన సిబ్బందితో అక్కడికి చేరుకుని తలుపులు వగులగొట్టి చూడగా ఇంట్లో ఇద్దరు విగత జీవులుగా పది ఉన్నారు. తమ చావుకు ఎవరు కారణం కాదని లెటర్ రాసి పెట్టినట్లు వారు తెలిపారు. వయోభారం, అనారోగ్యం కారణంగానే అత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. కొద్ది నెలల క్రితమే షష్టిపూర్తి ఘనంగా చేసుకున్నారని, అకస్మాత్తుగా ఆత్మహత్యకు పాల్పడడం తీవ్రంగా కలిచివేసిందని స్థానికులు పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

But іѕ іt juѕt an асt ?. Coaching methodik life und business coaching in wien tobias judmaier, msc. Stuart broad truly stands as a force to be reckoned with in the world of test cricket.