సోనియా ఆకుల, బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో గుర్తింపు పొందిన కంటెస్టెంట్‌గా నిలిచింది. తెలంగాణలోని మంథని ప్రాంతానికి చెందిన సోనియా, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు పొందలేదు. అయితే బిగ్ బాస్ హౌస్‌లో అడుగు పెట్టిన తర్వాత ఆమె పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. హౌస్‌లోని ఆటతీరుతో పాటు ఆమె మాట్లాడే తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమెను చాలా మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా భావించారు.కానీ నిఖిల్, పృథ్వీలతో ఆమె ప్రవర్తించిన తీరుపై కొందరు విమర్శలు చేశారు. దీంతో ఫైనల్ వరకు ఉంటుందనుకున్న సోనియా, అనూహ్యంగా నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయింది.
కొన్ని ఇంటర్వ్యూల్లో ఆమె షోపై, హోస్ట్ నాగార్జునపై సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషం.ఇప్పుడీ బిగ్ బాస్ ఫేం సోనియా తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుంది. తన ప్రియుడు యష్ పాల్ వీరగోనితో త్వరలోనే వివాహ బంధంలో అడుగు పెట్టబోతోంది. నవంబర్ 21న ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో ఈ జంట నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగింది. తాజాగా, డిసెంబర్ 21న మధ్యాహ్నం 3:40 గంటలకు తమ వివాహం జరగనుందని సోనియా స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. పలువురు బుల్లితెర తారలు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు, అభిమానులు సోనియాకు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.తాజాగా సోనియా-యష్ జంట బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను కలసి తమ వివాహానికి ఆహ్వానించారు. ఈ జంట నాగార్జునకు తమ వివాహ శుభలేఖ అందజేసి, పెళ్లికి రావాలని ఆహ్వానించారు. నాగార్జున ఈ వివాహానికి తప్పకుండా వస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోను యష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, “మా ప్రత్యేకమైన రోజు కోసం నాగార్జున గారిని ఆహ్వానించాం, ఆయన హాజరవుతానని మాట ఇచ్చారు” అని పేర్కొన్నారు.