harish rao arrest

మాజీ మంత్రి హరీష్‌రావు అరెస్ట్

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్‌రావును హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది. గురువారం ఉదయం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు హరీష్ రావు వెళ్లగా, పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకుని, ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో హరీష్ రావు అనుచరులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరికి హరీష్ రావును గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

పాడి కౌశిక్ రెడ్డిపై విధులకు ఆటంకం కలిగించినందుకు కేసు నమోదైంది. ఈ ఆరోపణలతో ఆయనను కొండాపూర్‌లో అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న హరీష్ రావు అక్కడికి వెళ్లడంతో, ఈ పరిణామాలు మరింత మలుపు తిరిగాయి. కౌశిక్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో హరీష్ రావు తన మద్దతు తెలియజేయడానికి అక్కడికి వెళ్లారని బీఆర్ఎస్ శ్రేణులు తెలిపారు. ఇదిలా ఉంటె హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసును రాజకీయం చేయడానికే ఫిర్యాదు దాఖలు అయ్యిందని హరీష్ రావు ఆరోపించారు. తనపై కేసు నిరాధారమని, న్యాయస్థానం ద్వారా తీర్పు సాధించేందుకు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు ప్రాథమిక విచారణ జరపకుండానే కేసు నమోదు చేయడం అన్యాయమని ఆయన అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

At home shirt care. Innovative pi network lösungen. The police response, greene said on social media.