మన పెరడు లేదా బాల్కనీలో కొన్ని రకాల మొక్కలను పెంచడం ద్వారా శారీరక, మానసిక మరియు ఆరోగ్యపరమైన అనేక లాభాలు పొందవచ్చు.దీనికి మంచి ఉదాహరణగా పుదీనా,కొత్తిమీర, కరివేపాకు వంటి మొక్కలు ఉన్నాయి ఈ మొక్కలు చిన్న స్థలంలో కూడా పెంచుకోవచ్చు. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సహాయపడతాయి.
పుదీనా ఒక ముఖ్యమైన మొక్క. దీన్ని ప్రధానంగా రుచి మరియు సువాసన కోసం వాడతారు. పుదీనా రసంలో కొద్దిగా తేనె మరియు నిమ్మరసం కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి. అలాగే, ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. పుదీనా పాలు లేదా మజ్జిగలో కలిపి తాగితే జ్వరం తగ్గుతుంది.ఇది జీర్ణ వ్యవస్థను సక్రమంగా ఉంచుతుంది మరియు కడుపులో వాయువును తగ్గిస్తుంది. పుదీనా లోని విటమిన్ ఎ, బి1, బి2, సి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
కొత్తిమీర కూడా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది చలువ మరియు తల తిప్పడం తగ్గించడానికి సహాయపడుతుంది.కొత్తిమీరలో విటమిన్ ఎ, బి1, బి2, సి వంటి పోషకాలూ ఉన్నాయి.ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణాన్ని కలిగి ఉంది. దీన్ని మజ్జిగలో కలిపి తాగితే జ్వరం తగ్గుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను పటిష్టంగా ఉంచి, కడుపులో వాయువు పెరగకుండా చేస్తుంది.
కరివేపాకు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మధుమేహం ఉన్నవారు కరివేపాకు పొడిని ఆహారంతో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు కొంతమేర తగ్గుతాయి.కరివేపాకు చారు లేదా కషాయం తీసుకోవడం వల్ల తలనొప్పి మరియు ఒత్తిడి తగ్గుతాయి.ఈ పొడిని అరచెంచా చొప్పున తీసుకుంటే ఎముకలు దృఢంగా ఉంటాయి.
ఈ మూడు మొక్కలు మన పెరడు లేదా బాల్కనీలో సులభంగా పెంచవచ్చు.వాటిని రోజూ ఉపయోగించుకుంటే మన ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు.ఇలాంటి సహజ మొక్కలు ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తాయి.