పుష్ప 2 ప్రచార కార్యక్రమం : రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ మధ్య సంబంధాలపై జరుగుతున్న చర్చలు మరోసారి వార్తల్లోకి వచ్చాయి. ఇటీవల జరిగిన “పుష్ప 2” ప్రచార కార్యక్రమంలో రష్మిక ఇచ్చిన సమాధానాలు వీరి మధ్య సంబంధాన్ని పరోక్షంగా సమర్థించినట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చెన్నైలో జరిగిన “పుష్ప 2” ఈవెంట్‌లో రష్మిక మందన్నా ప్రసంగం అనంతరం యాంకర్ ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. “మీరు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా, లేక ఇండస్ట్రీకి బయట ఉన్న వారిని? పెళ్లి చేసుకుంటారా”, రష్మిక సమాధానంగా, “ఆ విషయం అందరికి తెలుసు కదా,” అని పేర్కొంది. ఈ సమాధానం వెంటనే అక్కడ ఉన్న ప్రేక్షకులందరినీ ఉత్సాహంతో నింపింది.
అంతేకాకుండా, శ్రీలీలతో పాటు అల్లు అర్జున్ కూడా ఈ సమాధానానికి నవ్వారు.ఇటీవల విజయ్ ఒక ఇంటర్వ్యూలో, “మీరు సింగిలా లేక కమిటెడ్?”a అనే ప్రశ్నకు, “నాకు ఇప్పటికే 35 ఏళ్లు వచ్చాయి. ఇంకా సింగిల్‌గా ఉంటానా?” అని సరదాగా స్పందించా. ఈ వ్యాఖ్యలు, రష్మిక సమాధానం కలిపి వీరిద్దరి మధ్య ఉన్న బంధం గురించి పరోక్షంగా సంకేతాలిస్తున్నాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి రెస్టారెంట్‌లకు వెళ్లడం, వారి వెకేషన్ ఫొటోలు లీక్ కావడం వంటి ఘటనలు ముందే వీరి సంబంధంపై రూమర్లు తెచ్చాయి.
అంతేకాకుండా, రష్మిక ప్రతి పండుగను విజయ్ కుటుంబంతో గడపడం, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోవడం కూడా వీరి మధ్య ఉన్న అనుబంధాన్ని స్పష్టం చేస్తోంది.వీరిద్దరూ తమ ప్రేమను అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రష్మిక, విజయ్ మీద వస్తున్న వార్తలు ఎంతవరకు నిజమో తెలియదిగానీ, వారి సమాధానాలు అభిమానులకు ఊహాగానాలకు మంచి మద్దతునిచ్చాయి. ప్రస్తుతం రష్మిక, విజయ్ ఇద్దరూ తమ కెరీర్‌లపై దృష్టి పెట్టినప్పటికీ, వీరి ప్రేమ గురించి వచ్చిన పరోక్ష సంకేతాలు అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ఈ రూమర్లకు నిజం ఎప్పుడు చెబుతారో అనేది ఇప్పుడు అందరి ఎదురు చూపుల కేంద్రంగా మారింది.