Mohanlal Mammootty

16 ఏళ్ల తర్వాత కలవబోతున్న మమ్ముట్టి, మోహన్ లాల్

మలయాళ స్టార్ నటులు ముమ్ముట్టి, మోహన్ లాల్ లు 16 ఏళ్ల తర్వాత కలిసి సినిమా చేయబోతున్నారు. ఇద్దరు తమ కెరీర్ బిగినింగ్ నుంచే కలిసి నటించడం మొదలు పెట్టారు. మొత్తం 49 సినిమాలు చేశారు. మధ్యలో సరైన ప్రాజెక్ట్ సెట్ కాకపోవడంతో వీరిద్దరి కాంబోకి దశాబ్దం పాటు బ్రేక్ పడింది. తాజాగా వీరిద్దరూ కలిసి ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మోహన్ లాల్, మమ్ముట్టి గతంలో ఏడు సినిమాల్లో కలిసి నటించారు. చివరగా 2008లో ట్వంటీ అనే సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడు మళ్ళీ 16 ఏళ్ళ తర్వాత ఈ స్టార్ హీరోలు ఇద్దరూ కలిసి నటించబోతున్నారు. మహేష్ నారాయణన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్, నయనతార, కుంచకకోబన్, దర్శన రాజేంద్రన్.. ఇలా చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నేడు శ్రీలంకలో షూటింగ్ మొదలుపెట్టింది. ఏకంగా 150 రోజులు ఈ సినిమా షూటింగ్ చేస్తారట. నేడు సినిమా ఓపెనింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మలయాళం స్టార్ హీరోలు ఇద్దరూ కలిసి చేస్తుండటంతో ఈ సినిమాపై మళయాళంలోనే కాక వేరే పరిశ్రమల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మాలిక్, టేకాఫ్, సీ యూ సూన్‌ వంటి చిత్రాలతో దర్శకుడిగా పేరు సంపాదించుకున్న మహేశ్‌ నారాయణన్‌ ఈ మల్టీస్టారర్​ను తెరకెక్కిస్తున్నారు. మమ్ముట్టి కంపెనీ, ఆశీర్వాద్‌ సినిమాస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాయి. మ‌ల‌యాళ సినీ చ‌రిత్ర‌లో ఈ చిత్రం స‌రికొత్త రికార్డుల‌ను సృష్టిస్తుంద‌ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్​గా దక్షిణాదికి చెందిన ఓ నటితో మూవీ టీమ్​ చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇంకా ఈ సినిమాలో కుంచకో బోబన్, ఆసిఫ్‌ అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది చిత్ర బృందం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The dog with a drooping ear classic t shirt features a charming print that dog lovers will adore…. Unsere technologie erweitert ihre globale reichweite im pi network. Family of missing broadway dancer zelig williams holding faith that he will return home safe global reports.