door to door survey

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే శాతం ఎంత వరకు వచ్చిందంటే..!!

తెలంగాణ రాష్ట్ర సర్కార్ స‌మ‌గ్ర ఇంటింటి కుటుంబ స‌ర్వే చేస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 09 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే ప్రారంభమైంది. ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. కుటుంబ సభ్యుల ఆధార్ నెం లు , వారి ఆస్తులు , అప్పులు , ఇంట్లో ఉన్న వస్తువులు , ప్రభుత్వ పధకాలు అందుతున్నాయా లేదా..గత ప్రభుత్వం నుండి పొందిన పధకాలు , సొంత ఇల్లు ఉందా లేదా , ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నాయా లేదా ఇలా అనేక ప్రశ్నలు అడిగి ఆ వివరాలు నమోదు చేసుకుంటున్నారు.

గడిచిన పదకొండు రోజుల్లో 85.09 శాతం సర్వే పూర్తికాగా, గ్రామీణ ప్రాంతాల్లో 89.36 శాతం, పట్టణ ప్రాంతాల్లో 77.29 శాతం సర్వే పూర్తయ్యింది. పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతున్నది. గ్రామాల్లో కుటుంబాల గుర్తింపు కూడా త్వరగా పూర్తయ్యింది. పట్ణణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకుని ఉన్న వారితో పాటు అద్దె భవనాల్లో ఉంటున్న కుటుంబాలను గుర్తించడంలో అధికార యంత్రాంగం ఇబ్బందులకు గురయ్యింది. సర్వే కూడా పట్టణాల్లో ఇంటి యజమానులు అందుబాటులో లేక కాస్త జాప్యం అవుతున్నది. సర్వేకు అన్ని వర్గాల ప్రజలు సహకరిస్తుండడంతో అన్ని జిల్లాలో సర్వే శరవేగంగా జరుగుతుంది.

రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల గణనలో నిన్నటి వరకు 83,64,331 నివాసాలలో సర్వే పూర్తి అయింది. దేశానికే ఆదర్శవంతంగా అయ్యేవిధంగా నిర్వహిస్తున్న ఈ సమగ్ర ఇంటింటి సర్వేలో మొత్తం 1,16,14,349 నివాసాలలో నేటివరకు 83.64 లక్షలలో 72 శాతం సర్వే పూర్తయింది. నిన్నటి వరకు రాష్ట్రంలో 98.9 శాతం పూర్తి చేసి ప్రథమ స్థానంలో నిలవగా, 95 శాతంతో నల్గొండ జిల్లా ద్వితీయ స్థానంలో, 93.3 శాతంతో జనగాం జిల్లా తృతీయ స్థానంలో నిలిచాయి. 50.3 శాతం సర్వే పూర్తితో జీహెచ్‌ఎంసీ చివరి స్థానంలో ఉంది. 61.3 శాతంతో చివరి నుంచి ద్వితీయ స్థానాల్లో మేడ్చల్ మల్కాజిగిరి, 63 శాతంతో హన్మకొండ, 67.4 శాతంతో వికారాబాద్ జిల్లాలు తరువాతి స్థానాల్లో నిలిచాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gelar rapat paripurna, ini 10 rancangan randerda inisiatif dprd kota batam. Hаrrу kаnе іѕ mоdеrn england’s dаd : but is іt tіmе fоr hіm to соnѕіdеr stepping аѕіdе ? | ap news. Latest sport news.