ఈరోజుల్లో మనిషి బ్రతుకుతున్నాడంటే అది టాబ్లెట్స్ వల్లే అని చెప్పాలి. ఒకప్పుడు ఎలాంటి నొప్పి వచ్చిన తట్టుకునేవారు..టాబ్లెట్స్ అనేవి పెద్దగా వాడే వారు కాదు..మరి ఎక్కువైతే ఆయుర్వేదం మందులు వాడే వారు తప్ప..టాబ్లెట్స్ అనేవి వేసుకునేవారుకాదు..అందుకే వారు అంత గట్టిగా ఉండేవారు. కానీ ఇప్పటికి ప్రజలు మొత్తం టాబ్లెట్స్ తోనే బ్రతికేస్తున్నారు. చిన్న నొప్పి దగ్గరి నుండి సర్జరీ వరకు అంత టాబ్లెట్స్ తో నింపేస్తున్నారు. ఏమాత్రం నొప్పిని కూడా తట్టుకోలేని పరిస్థితి వచ్చింది. చిన్న దానికి పెద్ద దానికి టాబ్లెట్స్ వేసుకుంటూ బాడీ ని టాబ్లెట్స్ కు కేరాఫ్ గా మార్చేశారు. దీంతో డాక్టర్స్ ఎక్కువయ్యారు..హాస్పటల్స్ కు ఎక్కువయ్యాయి..మెడికల్ షాప్స్ గల్లీ ఒకటి అయ్యింది. అయితే చాలామంది ఏ చిన్న , పెద్ద నొప్పి వచ్చిన టక్కున మెడికల్ షాప్స్ కు వెళ్లడం వారి సమస్య చెప్పడం..మెడికల్ షాప్స్ వారు ఇచ్చే టాబ్లెట్స్ వేసుకోవడం చేస్తున్నారు. ఇలా ఆ టాబ్లెట్స్ పడితే ఆ టాబ్లెట్స్ వేసుకోవడం మంచింది కాదని డాక్టర్స్ చెపుతున్నారు
కొందరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఫార్మసీల్లో మందులు కొంటుంటారు. అయితే సరైన అవగాహన లేకుండా యాంటీబయాటిక్స్ వాడితే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు తీసుకుంటే అవి యాంటీబయాటిక్ కాదా అని అడిగి తెలుసుకోండి. ఒకవేళ యాంటీబయాటిక్ కేటగిరీకి చెందినవైతే వద్దని చెప్పండి. యాంటీబయాటిక్ వాడాలనుకుంటే డాక్టర్ సూచన తీసుకోవడం మంచిది అంటున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లో అన్ని వివరాలు ఉంటాయి. సగటు రోగి ఏ వ్యాధి తో బాధపడుతున్నాడు..ఎప్పటి నుండి బాధపడుతున్నాడు..అతని వయసు ఏంటి..అతడికి సరిపోయే డోస్ మెడిసిన్ ఇలా అన్ని క్లియర్ గా రాసి ఉంటాయి కాబట్టి అవి వేసుకున్న ఏ ఇబ్బంది ఉండదు. అంతే కాదు నొప్పి అని చెప్పగానే ఏ టాబ్లెట్ పడితే ఆ టాబ్లెట్ వేసుకుంటే డోస్ ఎక్కువై ప్రమాదానికి గురై ఛాన్స్ ఉంటుంది. సో ఇకనుండైనా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకోవడం మంచింది.