Deteriorating air quality in Delhi .work from home for 50 percent employees

ఢిల్లీలో క్షీణిస్తున్న గాలి నాణ్యత ..50 శాతం ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ ప్రమాదకర స్థాయికి చేరుకోవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. బుధవారం వరుసగా మూడో రోజుకూడా కాలుష్యం క్షీణించి ప్రమాదకరస్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీ, ఎన్సీఆర్‌ ప్రాంతంలో బుధవారం ఉదయం ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 450 కంటే ఎక్కువగా నమోదైంది. పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచి మరింత ఎక్కువగానే ఉంది. సోమవారం ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ (490) స్థాయితో పోలిస్తే మంగళవారం 460తో స్వల్పంగా మెరుగుదల నమోదైంది. ఈరోజు మరో పదిపాయింట్లు మెరుగుపడినప్పటికీ ఇంకా ప్రమాదకర విభాగంలోనే ఉంది. తీవ్ర వాయుకాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 50 శాతం మంది సిబ్బంది ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

‘కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటి నుంచి పనిచేయాలని నిర్ణయించింది. 50 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తారు. దీని అమలు కోసం ఈరోజు మధ్యాహ్నం 1 గంటలకు సచివాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించనున్నాం’ అని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ తెలిపారు. కాలుష్య తీవ్రతను నిరోధించడానికి నగర వ్యాప్తంగా కృత్రిమ వర్షం కురిపించడమొక్కటే మార్గమని ఢిల్లీ సర్కారు తెలిపింది. ఇందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరింది. సాధారణ జీవితాన్ని ప్రభావితం చేస్తున్న ఈ సంక్షోభంపై ప్రధాని జోక్యం చేసుకోవాలని అభ్యర్థించింది.

ఢిల్లీ ప్రభుత్వం గతంలో తన కార్యాలయాలు మరియు MCD కోసం అస్థిరమైన కార్యాలయ సమయాలను ప్రకటించింది. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ కార్యాలయాల సమయాలను ఉదయం 8.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు, ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాల సమయం ఉదయం 10 నుండి సాయంత్రం 6.30 వరకు నిర్ణయించబడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Kejar pertumbuhan ekonomi 8 persen, bp batam prioritaskan pengembangan kawasan strategis. But іѕ іt juѕt an асt ?. Latest sport news.