రోడ్డు ప్రమాదాలతో గంటకు ఎంత మంది చనిపోతున్నారో తెలుసా..?

దేశంలో రోడ్డు ప్రమాదాలపై కేంద్ర రవాణాశాఖ విడుదల చేసిన నివేదిక ఆందోళన కలిగిస్తోంది. 2023లో 4.80 లక్షల రోడ్డు ప్రమాదాల్లో 1.72 లక్షల మంది చనిపోయారని తెలిపింది. సగటున గంటకు 20 మంది చనిపోయారు. 4.62 లక్షల మంది గాయపడ్డారు. 2022తో పోల్చుకుంటే మృతులు, గాయాలపాలైన వారి సంఖ్య పెరిగింది. అత్యధికంగా ఉత్తర ప్రదేశ్ లో 23,652 మృతి, తమిళనాడులో 18,347 మృతి , మహారాష్ట్ర లో 15,366 మంది చనిపోయారు. అటు అత్యధికంగా తమిళనాడు లో 67,213 ప్రమాదాలు జరిగినట్లు నివేదికలో పేర్కొంది.

ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ రహదారులు మృత్యు మార్గాలుగా మారాయని కేంద్రం ఆవేదన వ్యక్తం చేసింది. ఢిల్లీలో సగటున గంటకు 55 చొప్పున వాహనాలు ఢీ కొంటున్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలలో జరుగుతున్న ప్రమాదాల విషయానికి వస్తే ఢిల్లీలో అత్యధికంగా 1,457 మంది రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇక, దేశంలో రోజుకు 26 మంది చిన్నారులు ప్రమాదాల్లో జీవితాలను కోల్పోతున్నారు. గత ఏడాది 9,489 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. వీరిలో పురుషులే ఎక్కువగా ఉంటున్నారని నివేదిక వెల్లడించింది. రహదారి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో గ్రామీణులు 68.4 శాతం మంది ఉండగా, పట్టణ ప్రాంతాలకు చెందిన వారు 31.5 శాతం మంది ఉన్నట్లు స్పష్టం చేసింది.

ఈ రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణాలు .. అతివేగం , డ్రైవింగ్ లో ఫోన్ ఉపయోగించడం, త్రాగి డ్రైవ్ చేయడం వంటి తప్పిదాలు ప్రమాదాలకు కారణమవుతాయి. అలాగే గుంతల రోడ్లు వల్ల, బ్రేకులు, టైర్లు, లైట్లు వంటి వంటివి సరిగా పని చేయకపోవడం వల్ల, ట్రాఫిక్ లైట్లను గౌరవించకపోవడం, యూటర్న్ వద్ద జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

下?. I’m talking every year making millions sending emails. 2025 forest river rockwood mini lite 2515s.