కాంతారా 2022లో విడుదలైన తెలుగు సినిమా. కన్నడలో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమాకు దర్శకత్వం వహించగా రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలుగులో విడుదల చేసింది. రిషబ్ శెట్టి, కిషోర్‌కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమిగౌడ, ప్రమోద్‌శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలై, తెలుగులో అక్టోబర్ 15న విడుదలైంది. రిషభ్ శెట్టి నటనకుగాను జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం దక్కింది.
ఇప్పుడు ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు హీరో రిషభ్ శెట్టినే దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ స్పెషల్ వీడియో రిలీజైంది. ఇక ‘కాంతార’ తొలి పార్ట్‌లో చూసిన కథకు ముందు ఏం జరిగింది? అనేది ఈ కాంతార చాప్టర్ 1లో చూపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ రెండు షెడ్యూళ్లు పూర్తైంది. రీసెంట్గా మూడో షెడ్యూల్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో హీరో రిషభ్ శెట్టి పాల్గొంటున్నారు. నాన్ స్టాప్‌గా 60 రోజులపాటు ఈ షూటింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లోని కీలక సన్నివేశాలు, పాటలు చిత్రీకరించనున్నట్లు సమాచారం.
కాంతార తొలి భాగాన్ని కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. కథంతా అటవీ ప్రాంతం బ్యాక్ డ్రాప్లో తీయడం వల్ల పెద్దగా ఖర్చు అవ్వలేదు. కానీ, ఈ ప్రీక్వెల్ మాత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. దీనికి దాదాపు రూ. 125 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథ 4వ సెంచరీలోదని, రిషభ్ శెట్టి కూడా భారీగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నారని ఇన్సైడ్ టాక్. మూవీలో వీఎఫ్ఎక్స్ డిజైన్స్ ఎక్కువగా ప్లాన్ చేస్తున్నారట. అందుకనే బడ్జెట్ రేంజ్ పెరిగినట్లు తెలుస్తోంది.