ప్రశ్నిస్తే సంకెళ్లు… నిలదీస్తే అరెస్టులు ఇదేమి ఇందిరమ్మ రాజ్యం – కేటీఆర్

Will march across the state. KTR key announcement

రాష్ట్రంలో ప్రశ్నిస్తే సంకెళ్లు, నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారని రేవంత్ ప్రభుత్వంపై KTR మండిపడ్డారు. ‘నియంత రాజ్యమిది, నిజాం రాజ్యాంగమిది. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపినందుకే కొణతం దిలీపు అరెస్ట్ చేశారు. విచారణకు రమ్మని పిలిచి అక్రమంగా అరెస్ట్ చేస్తారా? ఎన్నాళ్లు ఈ అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తావు. నీ అక్రమ అరెస్టులకు భయపడేవాడు ఎవరూ లేరిక్కడ’ అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపినందుకే కొణతం దిలీప్ గారిని అరెస్ట్ చేశారని ఆరోపించారు. విచారణకు రమ్మని పిలిచి అక్రమంగా అరెస్ట్ చేస్తారా? అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. అక్రమ అరెస్టులతో ఎన్నాళ్లు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారని నిలదీశారు. ప్రజాస్వామ్య ప్రేమికులం… ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కొంటామని పేర్కొన్నారు.

నీ అక్రమ అరెస్టులకో… నీ ఉడత బెదిరింపులకో భయపడేది లేదు, ఈ అక్రమ అరెస్టులకు భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరని పేర్కొన్నారు. మిస్టర్ రాహుల్ గాంధీ అంటూ ఆయనను ఉద్దేశించి ఇంగ్లీష్‌లో మరో ట్వీట్ చేశారు. మీ ద్వంద్వ వైఖరి కలవరపెడుతోందని, అసలు మీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మోదీ-అదానీ కలిస్తే స్కాం అయితే… రేవంత్-అదానీ కలిస్తే న్యాయం అవుతుందా? అని నిలదీశారు.

ధారవికి లక్ష కోట్లు వెచ్చిస్తున్నప్పుడు అది కుంభకోణమైతే… మూసీ ప్రాజెక్టుకు లక్షా యాభై వేల కోట్లు ఖర్చు చేస్తే న్యాయం అవుతుందా? అని నిలదీశారు. మీ వైఖరి బీజేపీకి భిన్నంగా ఉందా? మీ వైఖరి రాష్ట్రానికి రాష్ట్రానికి… ఎన్నికలకు ఎన్నికలకు మారుతుందా? అని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Latest sport news. 用規?.