లేడీ అఘోరీ అరెస్ట్..

aghori arest

రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దీ రోజులుగా లేడి అఘోరి హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యాచారాలు, గోహత్యల నివారణకే నేనున్నా అని అందుకోసం ఎన్నో పూజలు చేసానని చేస్తూనే ఉన్నానని చెపుతూ.. లోక కళ్యాణం, సనాతన ధర్మాన్ని కాపాడుతానని మీడియా ముందు చెప్పుకుంటూ తిరుగుతున్న అఘోరిని పోలీసులు అరెస్ట్ చేసారు.

సోమవారం ఏపీలోని మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవాలంటూ జనసేన పార్టీ ఆఫీసు ముందు బైటాయించింది. పవన్ కళ్యాణ్‌ను కలిశాకే వెళ్తానంటూ రోడ్డుపైనే అడ్డంగా కూర్చుంది. దీంతో ఎక్కడిక్కడే వాహనాలు నిలిపోయాయి. పవన్ కళ్యాణ్ ఇక్కడ లేరని ఎవరూ ఎంత సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా కూడా ఆమె అస్సలు వినలేదు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులపైనా కూడా అఘోరి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా అంతేకాకుండా వారిపైనే దాడికి ప్రయత్నించింది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

ఇక ఆమె చేష్టలకు విసుగెత్తి పోయినా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెను ఈడ్చు కెళ్ళి DCM లో పడేశారు. ఆమెను బలవంతంగా వాహనంలోకి ఎక్కించినా కానీ ఆమె తగ్గట్లేదు. దాంతో ఆమె ఒక్కసారిగా వాహనంలో నుంచి పోలీసులవైపుకి దూకి దాడి చేసే ప్రయత్నం చేసింది. అఘోరీ ప్రవర్తన చూసి ఆ రోడ్డుపైన ఆగిపోయిన ప్రయాణికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎంతోమంది అఘోరాలు ఉన్నారు కానీ ఇలా వారు జనాలను ఇబ్బంది పెట్టె ప్రయత్నాలు చేయలేదని మీడియాకి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Tips for choosing the perfect secret santa gift. 2 meses atrás. This document should outline your company’s commitment to protecting its data, networks, and systems from malicious threats.