keerthi suresh

కీర్తి సురేష్ ఈసారి పెళ్లి వార్తల గురించి నిజం

మహానటి కీర్తి సురేష్ పెళ్లి గురించి వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. గతంలో పలు సందర్భాల్లో ఆమె పెళ్లి వార్తలను పుకార్లుగా కొట్టిపారేసినా, ఈసారి మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. జాతీయ మీడియా నుంచి కోలీవుడ్‌ వరకు అన్ని చోట్లా కీర్తి సురేష్ పెళ్లి డిసెంబర్‌లో ఖాయమైంది అంటూ కథనాలు హల్‌చల్ చేస్తున్నాయి. గత రెండు రోజులుగా మళ్లీ కీర్తి పెళ్లి వార్తలు చర్చనీయాంశంగా మారాయి. బాలీవుడ్‌ మీడియా కూడా ఈ వార్తలను బలపరిచింది. అయితే, ఇప్పటివరకు కీర్తి సురేష్ కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ ఈ వార్తలపై అధికారికంగా స్పందించలేదు. మరి ఈసారి ఆమె ఈ వార్తలను ఖండిస్తుందా లేక సైలెంట్‌గా ఉండిపోతుందా అనేది ఆసక్తిగా మారింది.ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం, కీర్తి ఈసారి ప్రేమ వివాహం కాకుండా, తన కుటుంబ సభ్యులు కుదిర్చిన సంబంధానికి ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. వరుడిగా ఒక కుటుంబ స్నేహితుడిని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

అంతేకాకుండా నిశ్చితార్థం కూడా పూర్తయిందని కొన్ని కథనాలు చెబుతున్నాయి.కీర్తి సురేష్ కెరీర్ పరంగా చూస్తే, టాలీవుడ్‌లో ఇటీవల పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. అయితే కోలీవుడ్, బాలీవుడ్‌లలో తన ఫోకస్‌ను మళ్లించింది. ఆమె నటించిన దసరా చిత్రం మాత్రం ఈ మధ్య కాలంలో పెద్ద విజయంగా నిలిచింది. ఇకపోతే, ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలే ఎక్కువగా చర్చనీయాంశంగా మారాయి.గతంలోనూ అనిరుధ్‌తో కీర్తి సురేష్ డేటింగ్ చేస్తున్నట్లు రూమర్లు వినిపించాయి. ఇద్దరూ క్లోజ్‌గా ఉన్న ఫోటోలు వైరల్ అవ్వడం, పార్టీల్లో కలిసి కనిపించడం వంటి కారణాల వల్ల అప్పట్లో వారి డేటింగ్‌ గురించిన పుకార్లు గట్టిగా వినిపించాయి. ఈసారి పెళ్లి వార్తల గురించి నిజం తెలుసుకోవాలంటే, కీర్తి అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rapat paripurna dprd kota batam, pemerintah kota batam ajukan 8 poin ranperda. Un реасеkеереrѕ іn lebanon ѕау iѕrаеl hаѕ fіrеd on thеіr bаѕеѕ deliberately. Retirement from test cricket.