గుంటూరులో శ్రీ రెడ్డిపై కేసు నమోదు

srireddy

గత వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని కొంతమంది రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. తమ స్థాయిని మరచిపోయి చంద్రబాబు , పవన్ కళ్యాణ్ , లోకేష్ ఇలా ఎవర్ని పడితే వారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం..వీడియోలు పోస్ట్ చేయడం , ట్రోల్స్ చేయడం వంటివి చేసారు..ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్..సైలెంట్ గా ఉంటుందా..వరుసపెట్టి కేసులు పెడుతుంది. ఇప్పటికే అనేకమంది పై కేసులు నమోదు చేయగా..పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడం , నోటీసులు జారీ చేయడం చేస్తున్నారు.

కాగా గత సీఎం జగన్ అండ నుచూసుకొనో టీడీపీ , జనసేన , బీజేపీ నేతలే లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. పోస్టులు పెట్టిన సినీ నటి శ్రీ రెడ్డిపై గుంటూరులో కేసు నమోదైంది. మాజీ కార్పోరేటర్ దాసరి జ్యోతి.. శ్రీ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యులపై అసభ్యంగా నోటికొచ్చినట్లు మాట్లాడిన శ్రీ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో నగరం పోలీసులు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు.

అలాగే హోంమంత్రి వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటి శ్రీరెడ్డిపై తూర్పు గోదావరి జిల్లాలో కేసు నమోదు అయ్యింది. వైసీపీ హయాంలో సోషల్ మీడియా వేదికగా కూటమి నేతలపై శ్రీరెడ్డి తప్పుడు ప్రచారం చేశారంటూ టీడీపీ ఏపీ మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరెడ్డిపై 196, 353(2), 79 BNS, 67 ITA-2000-2008 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇలా వరుస కేసులు నమోదు అవుతుండడం తో శ్రీ రెడ్డి తనను క్షేమించండి అంటూ వేడుకోవడం చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“this move is aimed at protecting the personal data of zimbabweans in an increasingly online world,” said mavetera. Por fim, o acompanhamento contínuo é uma estratégia essencial para prevenir recaídas. イバシーポリシー.