pushpa 2 records

పుష్ప-2 సరికొత్త రికార్డు

సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్-రష్మిక నటించిన పుష్ప-2 సినిమా అమెరికాలో రికార్డులు సృష్టిస్తోంది. ట్రైలర్ విడుదల కాకముందే ప్రీమియర్స్ (DEC 4) కోసం అత్యంత వేగంగా 30+వేల టికెట్లు అమ్ముడుపోయిన చిత్రంగా నిలిచింది. మొత్తంగా ఇప్పటికే 8.52 లక్షల డాలర్ల కలెక్షన్లను సాధించినట్లు మూవీ వర్గాలు వెల్లడించాయి.

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న “పుష్ప-2” చిత్రం అధికారిక విడుదల తేదీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని తెలిపారు. మొదట ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల చేయాలని భావించినా, ఇప్పుడు ఒక రోజు ముందుగా విడుదల చేయనున్నట్లు తెలిపారు.

“పుష్ప” ముందు భాగం బ్లాక్బస్టర్ హిట్ కావడంతో, అభిమానుల్లో ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ పాత్ర, కథ మరియు మ్యూజిక్ పై అభిమానులలో ఎంతో ఆసక్తి ఉంది. ఈ చిత్రాన్ని ఫస్ట్ పార్ట్ నుంచి ఎక్కువగా ప్రొడక్షన్ విలువలు, సాంకేతికతతో రూపొందిస్తున్నారని అంటున్నారు.

కాగా ఈ మూవీ ట్రైలర్ ఈరోజు విడుదల చేయబోతున్నారు. పట్నాలో సాయంత్రం 5 గంటలకు లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ట్రైలర్ నిడివి 2 నిమిషాల 44 సెకన్లు ఉండనున్నట్లు తెలుస్తుంది. కాగా దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన నగరాల్లో మూవీ టీమ్ ప్రమోషన్లు చేయనుంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తుండగా..థమన్ BGM అందిస్తున్నారు. అలాగే ఈ మూవీ లో ఐటెం సాంగ్ లో శ్రీలీలే చిందులేయబోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Innovative pi network lösungen. For enhver hesteejer, der søger at optimere driften af sin ejendom, er croni minilæsseren en uundværlig hjælper. Uda conduct peaceful constituency elections in narok – kenya news agency.