మిడ్ మానేరు నిర్వాసితులకు గుడ్ న్యూస్

Good news for Mid Maneru re

మిడ్ మానేరు నిర్వాసితులకు కాంగ్రెస్ గుడ్ న్యూస్ తెలిపింది. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడి ద్వారకానగరం సముద్ర గర్భంలో మునిగిపోయినట్టు… నేటి కలియుగంలో జననివాసాలు మిడ్ మానేరులో మునిగిపోయాయి. మిడ్ మానేరు నిర్వాసితుల కథ.. ఎన్నటికీ తీరని వ్యధలాగా మారిన సంగతి తెలిసిందే. నీటిలో మునిగిపోయిన తమ గ్రామాలను, జ్ఞాపకాలను తలుచుకుంటూ రోదిస్తున్నారు ఆ గ్రామస్తులు.

ఉన్న ఊరు కన్నతల్లి లాంటిదని పెద్దలు చెబుతుంటారు. ఏ కష్టం వచ్చినా అయినవారు లేకపోయినా ఉన్న ఊరు అంతో ఇంతో సాయం చేస్తారని అందుకే ఉన్న ఊరు కన్నతల్లి లాంటిదని అంటారని పెద్దల మాట. చాలామంది పుట్టి పెరిగిన ఊరు నుండి ఏదో ఒక పని నిమిత్తం బయటకు వెళితేనే ఇంటికి వచ్చేవరకు మనశ్శాంతి అనిపించదు. అలాంటిది గ్రామాలు మొత్తం శాశ్వతంగా నీటిలో మునిగిపోయి తాము నివసించిన నివాసాలు కళ్ళముందే శిథిలాలు అవుతుంటే అవి చూసి గుండెలవిసేలా రోదించడం ఆ గ్రామస్తులకు అలవాటుగా మారింది. పుట్టి పెరిగిన ఊరు శిధిలాల మాదిరిగా స్మశానం మాదిరిగా మారితే ఆ శిధిలాలను చూస్తూ తమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆ గ్రామస్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

పచ్చదనంతో చుట్టూ పంట పొలాలతో, వందల కొద్ది కుటుంబాలతో గుడి, బడి చేను, చెలకా అహ్లాదపరిచే వాతావరణంతో ఒకప్పుడు సుందరంగా ఉండేవి ఆ గ్రామాలు. మిడ్ మానేరు ముంపుతో ఇప్పుడు ఆ గ్రామాలు స్మశానాన్ని తలపిస్తున్నాయి. ప్రాజెక్టు నీటితో మునిగిపోయిన గ్రామాల ప్రజలు రెక్కలు తెగిన పక్షుల్లా తలో దిక్కుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ శిథిలమైన ప్రాంతాలను చూస్తే గుండె బరువెక్కుతూ.. కన్నీటి పర్యంతం అవడం ఆ గ్రామస్తుల కన్నీటి వ్యధను గుర్తుచేస్తుంది.

ఇక ఇప్పుడు మిడ్ మానేరు నిర్వాసితుల కల నెరవేరింది. ఎళ్లతరబడి ఎదురుచూపులకు తెర పడింది. ప్రాజెక్ట్ సమయంలో ఇళ్లు, స్థలాలు కోల్పోయి నష్టపరిహారం కోసం పడిగాపులు కాస్తున్న నిర్వాసితులకు ఎట్టకేలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 12 గ్రామాలలోని నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

2006లో మిడ్ మానేర్ ​ప్రాజెక్ట్ నిర్మాణం​మొదలుపెట్టారు. 2019లో ఈ ప్రాజెక్ట్​పూర్తయింది. అయితే డ్యాం నిర్మాణం వల్ల చుట్టుపక్కల 12 గ్రామాలు నీట మునిగాయి. ఈ గ్రామాల్లోని 11,731 కుటుంబాలకు పరిహారం చెల్లించారు. ఆర్‌అండ్ఆర్​కాలనీలు ఏర్పాటు చేసి ఒక్కో కుటుంబానికి 242 గజాల చొప్పున ఇంటి స్థలం కేటాయించారు. అయితే ఈ జాగాల్లో నిర్వాసితులు సొంత డబ్బుతోనే ఇండ్లు నిర్మించుకున్నారు.

అయితే ఈ ఇళ్లు నిర్మించుకున్న వారందరికీ రూ.5.04 లక్షలు ఇస్తామని 2015 మాటిచ్చిన కేసీఆర్ ఆ తర్వాత మాట తప్పారు. ఆ తర్వాత 2016లో మిడ్ మానేరు కట్ట తెగినప్పుడు పరిశీలనకు వచ్చినప్పుడు కూడా ముంపు గ్రామాల్లో 18 ఏళ్లు నిండిన యువతకు రూ.2 లక్షలు ఇస్తామన్నారు. అందుకు 4 వేల మంది అర్హులుగా తేలితే.. వారిలో కేవలం 2 వేల మందికి మాత్రమే డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వారికీ ఇంద్రిమ్మ ఇల్లు మంజూరు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Latest sport news. Mushroom ki sabji : 5 delicious indian mushroom recipes brilliant hub.