Miss the test with minute rule

నిమిషం నిబంధనతో పరీక్ష మిస్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్‌-3 పరీక్షలు ఆదివారం మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 1,401 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 5,36,395 మంది అభ్యర్థులు గ్రూప్‌-3 పరీక్షలకు హాజరుకానున్నారు. హాల్‌ టికెట్‌ ఉన్నవారినే పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇచ్చారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బలగాలు 144 సెక్షన్ విధించారు. ఒక నిమిషం నిబంధన అమలు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) తెలుపడం తో పలువురు పరీక్షా రాయలేకపోయారు.

ఉదయం 8.30 గంటల నుంచి 9.30 వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించగా ఆదిలాబాద్లో కొందరు ఆలస్యంగా వచ్చారు. అప్పటికే అధికారులు గేట్లు మూసివేశారు. వారిని లోపలికి పంపలేదు. దీంతో 8 మంది అభ్యర్థులు కలెక్టర్ వద్ద మొర పెట్టుకున్నారు. పల్లెటూర్ల నుంచి వచ్చామని అనుమతించాలని రిక్వెస్ట్ చేశారు. రూల్స్ ప్రకారం కుదరదని కలెక్టర్ చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు.

ఖమ్మం జిల్లాలో గ్రూప్-3 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ ఎండ్ బీజీఎన్ఆర్ కళాశాల కేంద్రంలో గ్రూప్-3 పరీక్ష ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అధికారులు పరీక్షా హాలులోకి అనుమతించలేదు. దీంతో పలువురు అభ్యర్థులు నిరాశను వ్యక్తం చేశారు. సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు అభ్యర్థులకు సూచించిన ఆలస్యం అయ్యారు.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ 1 పరీక్ష ఉండగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష కొనసాగనుంది. జిల్లాలో మొత్తం 87 పరీక్ష కేంద్రాలు ఉండగా 27,984 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు.

రంగారెడ్డిలో 103 పరీక్ష కేంద్రాల్లో 56,394 మంది, హైదరాబాద్‌లో 102 కేంద్రాల్లో 45,918 మంది పరీక్ష రాయనున్నారు. ములుగు జిల్లాలో అత్యల్పంగా 9 కేంద్రాలుండగా.. 2,173 అభ్యర్థులు హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,36,395 మంది అభ్యర్థులు గ్రూప్‌-3 పరీక్షలకు హాజరుకానున్నారని టీజీపీఎస్సీ తెలిపింది. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కమిషన్‌ తెలిపింది. ఈరోజు , రేపు ఈ పరీక్షలు జరగబోతున్నాయి.

ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రత్యేక అధికారులు, రూట్‌ ఆఫీసర్లు, అన్ని పరీక్ష కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు, ఫ్లయింగ్‌ స్క్వా డ్లు పర్యవేక్షించనున్నాయి. గ్రూప్‌- 3 పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలని టీజీపీఎస్సీ ఆదేశించింది. విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు అనుమతించడం జరిగింది. 9:30గంటలకు గేట్లు మూసివేశారు. మధ్యాహ్నం పరీక్షకు 1.30 గంటల నుంచి 2.30 గంటల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతించి 2.30 గంటలకు గేట్లు మూసివేయనున్నారు. అలాగే ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. సంబంధిత అధికారుల సమక్షంలో ప్రశ్నాపత్రాలను సీసీ కె మెరా ముందు ఓపెన్‌ చేయాలని చీఫ్‌ సూపరింటెండెంట్‌లకు టీజీపీఎస్సీ అధికారులు సూచించడం అన్ని కేంద్రాల్లో అలాగే చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Só limitar o tempo de tela usado por crianças não evita prejuízos; entenda – jornal estado de minas. Die technische speicherung oder der zugriff, der ausschließlich zu anonymen statistischen zwecken verwendet wird. Ganando sin limites negocios digitales rentables.