తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-3 పరీక్షలు ఆదివారం మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 1,401 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 115 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 65,361మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలుస్తోంది. గ్రూప్ -3 పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం 5,36,395 మంది అభ్యర్థులు గ్రూప్-3 పరీక్షలకు హాజరుకానున్నారు. హాల్ టికెట్ ఉన్నవారినే పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇచ్చారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బలగాలు 144 సెక్షన్ విధించారు. ఒక నిమిషం నిబంధన అమలు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) తెలిపింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 115 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 65,361మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
రంగారెడ్డిలో 103 పరీక్ష కేంద్రాల్లో 56,394 మంది, హైదరాబాద్‌లో 102 కేంద్రాల్లో 45,918 మంది పరీక్ష రాయనున్నారు. ములుగు జిల్లాలో అత్యల్పంగా 9 కేంద్రాలుండగా.. 2,173 అభ్యర్థులు హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,36,395 మంది అభ్యర్థులు గ్రూప్-3 పరీక్షలకు హాజరుకానున్నారని టీజీపీఎస్సీ తెలిపింది. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కమిషన్ తెలిపింది. ఈరోజు , రేపు ఈ పరీక్షలు జరగబోతున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రత్యేక అధికారులు, రూట్ ఆఫీసర్లు, అన్ని పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వా డ్లు పర్యవేక్షించనున్నాయి. గ్రూప్- 3 పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలని టీజీపీఎస్సీ ఆదేశించింది. విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు అనుమతించడం జరిగింది. 9:30గంటలకు గేట్లు మూసివేశారు. మధ్యాహ్నం పరీక్షకు 1.30 గంటల నుంచి 2.30 గంటల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతించి 2.30 గంటలకు గేట్లు మూసివేయనున్నారు. అలాగే ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. సంబంధిత అధికారుల సమక్షంలో ప్రశ్నాపత్రాలను సీసీ కె మెరా ముందు ఓపెన్ చేయాలని చీఫ్ సూపరింటెండెంట్‌లకు టీజీపీఎస్సీ అధికారులు సూచించడం అన్ని కేంద్రాల్లో అలాగే చేసారు.