Innovia Motors delivered Aprilia RS457 on 25th in Vijayawada

విజయవాడలో 25వ ఏప్రిలియా RS457ను డెలివరీ చేసిన ఇన్నోవియా మోటర్స్

విజయవాడ: పియాజియో ఇండియా యొక్క ప్రతిష్టాత్మక ద్వి చక్ర వాహన బ్రాండ్‌లు వెస్పా మరియు ఏప్రిలియా కోసం అధీకృత రిటైలర్ అయిన ఇన్నోవియా మోటర్స్, ఈరోజు విజయవాడలోని బెంజ్ సర్కిల్‌లో ఉన్న తమ ప్రీమియం షోరూమ్‌లో నగరంలోని 25వ ఏప్రిలియా RS457ని శ్రీ వలిశెట్టి వెంకటేష్‌కి డెలివరీ చేసింది. ఈ వాహనాన్ని ఇన్నోవియా మోటర్స్ సీఈవో ఎ. వినోద్ రెడ్డితో కలిసి ఎస్‌బీఐ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ బాబురావు ఆయనకు అందజేశారు.

ఏప్రిలియా RS457 దాని అధిక పనితీరు 457cc ఇంజిన్‌ కలిగి మిడ్-పెర్ఫార్మెన్స్ విభాగంలో ప్రత్యేకంగా నిలిచింది. ఈ బ్రాండ్ ఇటీవల భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మోటర్‌సైకిల్ ప్రేమికుడు మరియు బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహంను తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నుకుంది.

తన ఏప్రిలియా RS457 డెలివరీని తీసుకున్న శ్రీ వలిసెట్టి వెంకటేష్ మాట్లాడుతూ, “నేను ఏప్రిలియా RS457ని ఇంటికి తీసుకెళ్లడానికి చాలా సంతోషిస్తున్నాను. బైక్ యొక్క పనితీరు అసాధారణమైనది. నా స్పోర్ట్స్ బైక్ రైడింగ్ ప్రయాణాన్ని ఏప్రిలియాతో ప్రారంభించాలని నేను ఆసక్తిగా ఉన్నాను మరియు ఇన్నోవియా మోటర్స్ వారు అందించిన అన్ని సహాయానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..” అని అన్నారు. ఏప్రిలియా RS457 మూడు విభిన్న రంగులతో వస్తుంది – రేసింగ్ స్ట్రిప్స్, ఒపలెసెంట్ లైట్ మరియు ప్రిస్మాటిక్ డార్క్. ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 4.11 లక్షల ఎక్స్-షోరూమ్ ధరను ఇది కలిగివుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gelar rapat paripurna, ini 10 rancangan randerda inisiatif dprd kota batam. Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. India vs west indies 2023 archives | swiftsportx.