ధనుష్‌ని బహిరంగంగానే ఏకిపారేసిన నయనతార

nayanthara

నెట్‌ఫ్లిక్స్‌లో నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ జంటపై రూపొందించిన డాక్యుమెంటరీ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీలో వారి ప్రేమకథ మొదలుకొని పెళ్లి వరకు అన్ని ముఖ్యమైన సంఘటనలూ చూపించబడ్డాయి. అయితే, ఈ డాక్యుమెంటరీలో నాను రౌడీనే సినిమాకు సంబంధించిన కొన్ని క్లిప్స్, లిరిక్స్ ఉపయోగించడంపై ధనుష్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. నిర్మాతగా ఉన్న ధనుష్, వాటిని ఉపయోగించేందుకు అనుమతి ఇవ్వలేదట. నయనతార, విఘ్నేశ్‌లు తమ పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్‌ నెట్‌ఫ్లిక్స్‌కు అమ్మిన సమయంలో, వారి జీవన ప్రయాణంలో కీలకమైన నాను రౌడీనే సినిమా సన్నివేశాలను ఉపయోగించడానికి ధనుష్‌ ఎన్వోసీ కోసం అడిగారు. కానీ ధనుష్‌ దీనికి మంజూరు ఇవ్వలేదట. వారి కథకు ఆ పాటలు, సన్నివేశాలు ఎంతో బాగా సరిపోతాయని చెప్పినా ధనుష్‌ ఒప్పుకోలేదని నయన్‌ ఆవేదన వ్యక్తం చేసింది.ధనుష్‌ నుండి అనుమతి రాకపోవడంతో, నయన్‌, విఘ్నేశ్‌లు వారి సొంత కెమెరాలతో తీసుకున్న మూడు సెకన్ల విజువల్స్‌ను మాత్రమే డాక్యుమెంటరీలో చేర్చారు. అయినప్పటికీ, ధనుష్‌ ఈ క్లిప్‌ వాడుకపై లీగల్ నోటిస్ పంపించి, పది కోట్ల రూపాయల నష్టపరిహారం డిమాండ్ చేశాడు. ఈ ఘటనపై నయనతార తీవ్రంగా స్పందిస్తూ ధనుష్‌ను కఠినంగా విమర్శిస్తూ ఓ బహిరంగ లేఖ విడుదల చేసింది. అందులో ధనుష్ వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తూ, అతను మోసపూరితమైన నీతి సూక్తులు చెప్పేవాడని, వేదికలపై చెప్పే మాటలు ఆయన ప్రవర్తనలో ప్రతిఫలించడంలేదని నయన్ పేర్కొంది.

“నువ్వు మాట్లాడే ముందు నీ మాటలను పాటించు. మాపై ఇంత ద్వేషం ఎందుకు మా సంతోషాన్ని చూసి నీకు ఇబ్బంది ఎందుకు నీ ఇగోని కంట్రోల్‌ చేసుకోవడం నేర్చుకో. ప్రేమను పంచడమే ఈ ప్రపంచానికి ముఖ్యమైన విషయం. మాకు నీ అవసరం లేదు; మేము మా జీవితాన్ని మా శైలిలో ముందుకు తీసుకెళ్తాం” అని నయన్ తన లేఖలో ధనుష్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. నయనతార, ధనుష్‌ల మధ్య ఈ వివాదం కోర్టు వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ డాక్యుమెంటరీపై చుట్టూ ఏర్పడిన చర్చలు నెటిజన్లను మరింత ఆకర్షిస్తున్నాయి. ప్రేమ, ద్వేషాల కలగలపు చివర ఏమవుతుందో చూడాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Im life coaching ist es mein ziel, sie auf ihrem weg zu persönlichem wachstum und erfolg zu begleiten. Hest blå tunge. Kwesi adu amoako.