anil

బోరుగడ్డకు రాచమర్యాదలు చేసిన పోలీసులు సస్పెండ్

బోరుగడ్డ అనిల్ కేసులో మరో నలుగురు పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అనిల్ కు గుంటూరు PSలో రాచమర్యాదలు చేసినట్లు తేలడంతో హెడ్ కానిస్టేబుళ్లు సర్దార్, గౌస్, శ్రీనివాసరావు, కానిస్టేబుల్ పరమేశ్వరరావును సస్పెండ్ చేశారు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ పెద్దల అండతో చెలరేగిపోయిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ కు ఇప్పుడు చంద్రబాబు సర్కార్ నిద్ర కూడా పట్టకుండా చేస్తుంది. వరుసపెట్టి కేసులు నమోదు చేసి వణుకుపుట్టిస్తుంది. కేవలం ఈయనకు మాత్రమే కాదు ఈయనకు రాచమర్యాదలు చేసిన వారికీ..చేయాలనుకునేవారికి కూడా చుక్కలు చూపిస్తుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బోరుగడ్డపై నమోదైన కేసుల్లో అరెస్టు చేయడం, కోర్టులో హాజరుపర్చడం, అనంతరం రిమాండ్ కు పంపడం చేస్తున్నారు.

ఈ క్రమంలో రిమాండ్ లో ఉన్న అనిల్ కు కొంతమంది పోలీసులు రాచమర్యాదలు చేస్తుండడం పై యావత్ ప్రజలు ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు, ఓ రౌడీ షీటర్ కు మర్యాలు చేయడం ఏంటి అని పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యింది. వారం క్రితం ఓ రెస్టారెంట్ లో అనిల్ కు విందు భోజనం పెట్టిన ఘటనలో పలువురు పోలీసులను సస్పెండ్ చేయగా..తాజాగా జైల్లో మర్యాదలు చేసిన పోలీసులపై వేటు వేశారు ఉన్నతాధికారులు. అనిల్కు గుంటూరు PSలో రాచమర్యాదలు చేసినట్లు తేలడంతో హెడ్ కానిస్టేబుళ్లు సర్దార్, గౌస్, శ్రీనివాసరావు, కానిస్టేబుల్ పరమేశ్వరరావును సస్పెండ్ చేశారు. అనిల్కు స్టేషన్లోనే దుప్పటి, దిండు ఇవ్వడం, మేనల్లుడిని కలిసేందుకు పర్మిషన్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Room archives explore the captivating portfolio. Schaffung von arbeitsplätzen für lokale pi network user. Elle macpherson talks new book, struggles with addiction, more.