ramya krishnan

ఏకంగా ఎయిర్‌పోర్ట్‌లోనే గ్లామర్ షో , కెమెరాలకు చిక్కిన శివగామి

సినీ రంగంలో ఎన్నో తారలు వస్తారు, వెళ్తారు. అయితే, మహానటి సావిత్రి, భానుమతి, వాణిశ్రీ, శ్రీదేవి, ఐశ్వర్యరాయ్ వంటి వారు మాత్రమే తమకంటూ ప్రత్యేక గుర్తింపుతో నిలుస్తారు. వీరి సరసన రమ్యకృష్ణ కూడా నిలిచారు. కథానాయికగా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా అద్భుతమైన ముద్ర వేసిన రమ్యకృష్ణ,50 సంవత్సరాలు దాటినప్పటికీ తన గ్లామర్‌తో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. ఇటీవల ఆమె ఎయిర్‌పోర్ట్‌లో పలు స్టైలిష్ అవతారాల్లో కనిపించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 90వ దశకంలో రమ్యకృష్ణ దక్షిణాదిలో తనదైన ముద్రను వేశారు.

ఆమె పాత్రల్లోని అహంకారం, అమాయకత్వం, పవర్‌ఫుల్ లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 1985లో విడుదలైన భలేమిత్రులు చిత్రంతో తెరంగేట్రం చేసిన రమ్య, తొలుత కొంత విఫలమైనా, క్రమంగా మంచి అవకాశాలు అందుకున్నారు. కే. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సూత్రధారులు ఆమెకు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఆ తర్వాత కే. రాఘవేంద్రరావు సినిమాలు ఆమెను స్టార్ హీరోయిన్‌గా మార్చాయి. అల్లుడుగారు, హలో బ్రదర్ వంటి చిత్రాలు ఆమెకు అపారమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి.రజనీకాంత్‌తో కలిసి నటించిన నరసింహ చిత్రంలోని నీలాంబరి పాత్ర ఆమెకు ప్రత్యేక గుర్తింపునిచ్చింది. ఆ పాత్రలోని ప్రతీకారంతో రమ్యకృష్ణ కొత్త శక్తిని ప్రదర్శించారు. ఈ విజయాల అనంతరం, ఆమె దర్శకుడు కృష్ణవంశీతో ప్రేమించి వివాహం చేసుకున్నారు. బాహుబలి చిత్రంలో రాజమాత శివగామి పాత్రలో రమ్య రాజసం ఒలికించగా, ఇపుడు తన తాజా ఫోటోషూట్లతో కుర్ర హీరోయిన్లకే సవాలు విసురుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Integration des pi network für weltweite zahlungen. Hest blå tunge. Nasa europa clipper mission imperiled by chips on spacecraft.