త్వరలో భారత్‌-చైనా రక్షణ మంత్రుల భేటి..!

Defense Ministers of India and China will meet soon

న్యూఢిల్లీ: త్వరలో భారత్‌-చైనా రక్షణ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, డోంగ్‌ జున్‌ భేటీ కానున్నట్లు సమాచారం. ఈ మేరకు వారి మధ్య సరిహద్దు, ప్రాంతీయ స్థిరత్వమే అజెండాగా చర్చలు జరగనున్నట్లు తెలుస్తుంది. ఆసియాన్ రక్షణమంత్రుల సమావేశాలకు అనుబంధంగా వచ్చేవారం వీరి భేటీ జరిగే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి నాలుగేళ్లుగా కొనసాగిన ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఇరుదేశాలు కీలక గస్తీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనిప్రకారం.. 2020 నాటి యథాస్థితి ఎల్‌ఏసీ వెంబడి ఇక కొనసాగుతుందని, ఇరుదేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్‌ పాయింట్లకు ఇక స్వేచ్ఛగా వెళ్లొచ్చని రెండు దేశాలు ఒప్పందంలో పేర్కొన్నాయి. దానిలోభాగంగా కీలక ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైనికులు తమ మౌలిక సదుపాయాలను, ఇతర సామగ్రిని వెనక్కి తీసుకున్నట్లు ఆర్మీ వర్గాలు ఇటీవల వెల్లడించాయి.

2020 జూన్‌ 15న తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌-చైనా సైనికుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్‌ సంతోష్‌బాబు సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనా కూడా భారీగా సైనికులను కోల్పోయింది. కానీ ఆ సంఖ్యను వెల్లడించలేదు. చాలా నెలల తర్వాత ఐదుగురు చనిపోయినట్లు అధికారికంగా అంగీకరించింది. ఈ ఘర్షణల నేపథ్యంలో ఇరు దేశాలు ఎల్‌ఏసీ వెంబడి భారీస్థాయిలో బలగాలను మోహరించాయి. ఆ ఉద్రిక్తతలకు గస్తీ ఒప్పందంతో ఓ ముగింపు పలికారు. ఈ పరిణామాల మధ్య రాజ్‌నాథ్‌ సింగ్‌, డోంగ్‌ జున్‌ భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whаt wіll іt tаkе tо turn the tіdе ?. House republican demands garland appoint special counsel to investigate biden over stalled israel aid. Latest sport news.