ఏదో ఒక కేసులో ఇరికించి నన్ను అరెస్టు చేస్తారని ఎప్పుడో తెలుసు : కేటీఆర్‌

Will march across the state. KTR key announcement

హైదరాబాద్‌: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి మండిపడ్డారు. లగచర్ల ఘటనలో కుట్ర జరిగిందని చెబుతుండటంపై కేటీఆర్‌ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ‘ఏదో ఒక కేసులో ఇరికించి నన్ను అరెస్టు చేస్తారని ఎప్పుడో తెలుసు’ అని కేటీఆర్‌ అన్నారు. రైతుల గొంతుకైనందుకు అరెస్ట్‌ చేస్తే గర్వంగా జైలు కెళ్తానన్నారు. ‘కుట్రలకు భయపడేవాళ్లు ఎవరూ లేరు.. అరెస్ట్‌ చేస్కో రేవంత్‌రెడ్డి’ అని సవాల్ విసిరారు.

”ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? అల్లుడు, అన్న కోసం.. రైతన్న నోట్లో మట్టికొట్టడం కుట్ర కాదా?9 నెలలుగా రైతుల జీవితాలను రోడ్డున పడేయడం కుట్ర కాదా?మర్లపడ రైతులు ఎదురు తిరిగినందుకు చిత్రహింసలు పెట్టారు.” అని కేటీఆర్‌ ఆరోపించారు. పేదల ఇళ్లను కూల్చి రోడ్డున పడేశారని ధ్వజమెత్తారు. మర్లపడ రైతులు, ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర? రూ.50 లక్షల బ్యాగులతో దొరికిన దొంగలకు, రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది? చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో” అని కేటీఆర్ ధ్వజమెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

   lankan t20 league. Baby bооmеrѕ, tаkе it from a 91 уеаr оld : a lоng lіfе wіth рооrеr hеаlth іѕ bаd nеwѕ, аnd unnесеѕѕаrу. (philippine coast guard via ap).