క్రేజీ కాంబో దర్శకుడు అనిల్ రావిపూడి తెలివే వేరబ్బా

raman gogula

సంగీత దర్శకుడు రమణ గోగుల తన ప్రత్యేకమైన శైలితో తెలుగు సినీ ప్రపంచంలో ఎన్నో హిట్ పాటలు అందించారు. ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘ప్రేమంటే ఇదేరా’, ‘లక్ష్మీ’ వంటి సినిమాల్లో ఆయన అందించిన సంగీతం ఇప్పటికీ ప్రేక్షకులను మధుర జ్ఞాపకాలలో ముంచేస్తుంది. గతంలో విక్టరీ వెంకటేష్‌తో రమణ గోగుల కాంబినేషన్‌లో వచ్చిన రెండు సినిమాలు ఘన విజయం సాధించాయి. కానీ ఎందుకో ఆ తర్వాత వీరి కలయిక కనిపించలేదు.

ఇప్పుడు దర్శకుడు అనిల్ రావిపూడి ఈ క్రేజీ కాంబోను తిరిగి తెరపైకి తీసుకురావడం ఆసక్తికరంగా మారింది. తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’కి భీమ్స్ సంగీతం అందించినప్పటికీ, ఇందులో ఓ ప్రత్యేకమైన పాట కోసం రమణ గోగులతో పాడించారు. “గోదారి గట్టు మీద రామ సిలకవే” అనే పాటను ఆయన పాడడంతో ఈ పాటకే కొత్త హొయలు వచ్చాయని అనిల్ రావిపూడి, భాస్కర్ భట్ల ఓ వీడియో ద్వారా తెలిపారు.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ, ఈ పాటకు ఒక పెక్యులర్ వాయిస్ అవసరమని భావించినప్పుడు రమణ గోగుల పేరే ముందుకొచ్చిందని తెలిపారు. దీంతో సంగీత దర్శకుడు భీమ్స్ కూడా ఆయనతోనే పాట పాడించాలనే నిర్ణయానికి వచ్చారు. 2006లో ‘లక్ష్మీ’ సినిమా తర్వాత 18 ఏళ్లకు రమణ గోగుల తన గొంతును వెంకటేష్‌ సినిమా కోసం వినిపించడం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Abu obeida, a spokesperson fоr hаmаѕ’ѕ armed wіng, ѕаіd in a ѕреесh оn thе аnnіvеrѕаrу оf thе 7 october аttасk thаt thе. House republican demands garland appoint special counsel to investigate biden over stalled israel aid – mjm news. India vs west indies 2023.