Megastar Chiranjeevi about satyadev 20241113 081046 0000

అలా వచ్చి వెళ్లిన వాల్తేరు వీరయ్య చిరు

మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఏ భావోద్వేగాన్నైనా అద్భుతంగా చూపించగలరు అని అందరికీ తెలుసు. అయితే చాలా మంది చిరును ఫుల్ మాస్ హీరోగా గుర్తించటం సాధారణం, కానీ ఆయనకు ఉన్న వింటేజ్ కామెడీ టైమింగ్‌కి కూడా ఒక ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉంది.

ప్రస్తుతం ఈ వింటేజ్ కామెడీ సైడ్ మాత్రం చిరు సినిమాల్లో చాలా అరుదుగా కనిపిస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. చిరు నటించిన అన్నయ్య, జై చిరంజీవ వంటి చిత్రాల్లో ఆయన కామెడీ టైమింగ్ అమోఘంగా ఉంటుందనీ, ఆయన నటనా సామర్థ్యానికి అసలైన తార్కాణం అవుతుందని అనేక మంది అంటున్నారు. ఇటీవల వాల్తేరు వీరయ్య చిత్రంలో చిరు కామెడీకి కొంత అవకాశం వచ్చింది, కానీ చిరు చెలరేగే స్థాయి మాత్రం అందులో కనిపించలేదు. తాజాగా, యువ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన జీబ్రా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చిరు తన స్పాంటేనియస్ కామెడీని చూపించి, వేదికపై అందరి మన్ననలను అందుకున్నారు. ఆ ఈవెంట్‌లో చిరు మాట్లాడుతూ ఒక అరుదైన సందర్భంలో త‌న‌దైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. ఈ సందర్భం ప్రత్యేకంగా వాల్తేరు వీరయ్య తరహా కామెడీ మూడ్‌కి అనుకూలంగా ఉండటంతో చిరు తన సొంత శైలిలో స్పందించడంతో ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ లభించింది.

ఆ స్పాంటేనియస్ కామెడీ క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆయన ఎప్పుడు కామెడీకి తగ్గ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రేక్షకులను అలరించేవారు. ఇప్పుడు, అభిమానులు చిరు కామెడీ టైమింగ్ ని మరింతగా ఆన్-స్క్రీన్‌లో చూడాలని, భవిష్యత్తు ప్రాజెక్టులలో కూడా ఆ హాస్యాన్ని మరింతగా ప్రదర్శించేందుకు స్క్రిప్టులు రావాలని ఆశిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gelar rapat paripurna, ini 10 rancangan randerda inisiatif dprd kota batam. Ground incursion in the israel hamas war. Latest sport news.