డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి అనిత

Home Minister Anita responded to Deputy CM Pawan Kalyan comments

అమరావతి : డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ నిన్న రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు , నేరాల పట్ల హోం శాఖా కు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. శాంతిభద్రతలు అదుపులో లేకుంటే, అవసరమైతే హోంమంత్రి పదవిని కూడా తాను తీసుకోవడానికి వెనుకాడనని స్పష్టం చేశారు. అయితే ఈ వ్యా ఖ్యలపై హోంమంత్రి అనిత స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న నేరాల విషయంలో అందరమూ బాధపడుతున్నామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ బయటపడ్డారు.. మేం పడలేదు.. అంతే తేడా అని చెప్పారు. ఆయనతో క్లారిటీగా మాట్లాడానని, సోమవారం పవన్ మాట్లాడిన మాటలను పాజిటివ్ గా తీసుకుంటానని చెప్పారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను పకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ మేరకు అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో మహిళలపై అఘాయిత్యాలు, గంజాయి వంటి అంశాలపై చర్చించినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. నేరాలను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిపామన్నారు.

శ్రీ సత్యసాయి జిల్లాలో గ్యాంగ్ రేప్‌ జరగడం బాధాకరమని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు. గతంలో రాజకీయంగా నేరాలు ప్రోత్సహించడమే ఇప్పుడీ పరిస్థితికి కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. నేరస్థులకు వెంటనే శిక్షలు విధించి, అమలు చేయడానికి ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబుతో మాట్లాడతానని అనిత చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. జగన్ కు భావప్రకటన స్వేచ్ఛ ఇప్పుడు గుర్తుకు వచ్చినట్లుంది.. గత ప్రభుత్వ హయాంలోనూ పోలీసులు ఇబ్బంది పడ్డ విషయం మాత్రం గుర్తులేదని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Thеrе wаѕ nо immediate response frоm iѕrаеl, whісh hаѕ соnѕіѕtеntlу ассuѕеd thе un of іnѕtіtutіоnаl bіаѕ against іt. Sarah rumpf whitten is a breaking news writer for fox news digital and fox business. Retirement from test cricket.