చికిత్స కోసం విజయ్‌ని ఆసుపత్రికి తరలింపు

vijay devarakonda

టాలీవుడ్‌ యాక్షన్‌ హీరో విజయ దేవరకొండ షూటింగ్‌లో గాయపడినట్టు సమాచారం. యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదం జరిగి గాయాలపాలయ్యారని తెలుస్తోంది. వెంటనే చిత్రబృందం విజయ్‌ను ఆసుపత్రికి తరలించి, వైద్యుల సమీక్షలో ఫిజియోథెరపీ కూడా అందిస్తున్నారని తెలిసింది. చికిత్స అనంతరం విజయ్ మళ్లీ షూటింగ్‌లో పాల్గొన్నారని సమాచారం ఉంది, అయితే ఈ ఘటనపై చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ వీడీ12 అనే ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ తన గత చిత్రాలు అంచనాలను అందుకోలేకపోవడంతో ఈ సినిమాపైనే పెద్దగా ఆశలు పెట్టుకున్నాడు. ఇటీవల విడుదలైన పోస్టర్లు అభిమానులను ఆకట్టుకోవడంతో, సినిమా పై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి.

ఈ సినిమాలో విజయ్ డబుల్ రోల్‌లో కనిపించనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఒకటి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అని, అది ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని ఫిల్మ్‌నగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వీడీ12 చిత్రం వచ్చే ఏడాది మార్చి 28న విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత విజయ్, రాహుల్ సాంకృత్యాయన్, రవికిరణ్ కోలా దర్శకత్వంలో మరిన్ని చిత్రాలను చేయనున్నాడని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

But іѕ іt juѕt an асt ?. Latest sport news. 用規?.