తెలంగాణలో నవంబర్‌ 6 నుండి ఒక్కపూట బడులు..?

Half day schools in Telangana from November 6th

అమరావతి: తెలంగాణలో నవంబర్‌ 6 నుండి పాఠశాలలకు ఒక్కపూట బడులను నిర్వహించనున్నారు. అయితే తెలంగాణలో జరుగుతున్న కులగణన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 6వ తేదీ నుంచి తెలంగాణలో కులగణన మొదలుకానుంది. దీనికి సంబంధించి, 36,559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లను, 3,414 ప్రైమరీ పాఠశాల హెడ్మాస్టర్లను మరియు 8,000 మంది ఇతర సిబ్బందిని ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో, సర్వే పూర్తి అయ్యే వరకు ప్రైమరీ పాఠశాలలు ఒక్కపూటనే పనిచేయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉపాధ్యాయులు పాఠశాలలో విధులు నిర్వహిస్తారు. ఆ తరువాత, కులగణన కోసం ఇంటింటికి వెళ్లాల్సి ఉంటుంది.

ఈ విధానం కేవలం ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినదేనా? ప్రైవేట్ పాఠశాలలకు ఇది వర్తిస్తుందా అనే సందేహం ఉంది. కులగణన విషయంలో, ప్రతి 150 ఇళ్లకు ఒక పర్యవేక్షణ అధికారితో పాటు కులగణన అధికారులను ప్రభుత్వం నియమించింది. కుటుంబ సభ్యుల నుంచి 50 ప్రశ్నల ఆధారంగా డేటా సేకరించనున్నారు. దీనికి ప్రత్యేకంగా సర్వే కిట్లు రూపొందించబడాయి. కులగణన సాధారణ సర్వేలుగా ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

మరోవైపు ఈ కులగణనపై బీఆర్‌ఎస్‌ పార్టీ విమర్శలు చేస్తోంది. దీనికి చట్టబద్ధత లేదని అభిప్రాయపడుతున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వంకు లేదని, అందుకే ప్రజాభిప్రాయాన్ని సేకరించడానికి ఈ క్రమంలో ఉన్నారని విమర్శిస్తున్నారు. కుల సంఘాలు కూడా కులగణన మరియు బీసీ కమిషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. లెక్కలు ఖచ్చితంగా రాకపోతే పెద్ద సమస్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

ఇకపోతే..రాష్ట్రంలో కులగణనను చాలా పకడ్బందీగా నిర్వహిస్తామని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ స్పష్టం చేశారు. ఈ కులగణన సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చినా.. తప్పుడు సమాచారం నమోదు చేసినా చర్యలు తప్పవని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారంనిరంజన్ మాట్లాడుతూ.. కులగణన ద్వారా అన్ని కులాల సామాజిక ఆర్థిక పరిస్థితిని తెలుసుకుంటామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

??. I done for you youtube system earns us commissions. New 2024 forest river ahara 380fl for sale in arlington wa 98223 at arlington wa ah113 open road rv.