ఐపీఎల్-18 మెగా వేలానికి ముందు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ తమ ప్రధాన ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసింది, వీరిలో తొలి రిటైనర్ గా విరాట్ కోహ్లీ నిలిచారు, జట్టులో అతనికి అత్యున్నత ప్రాధాన్యత కల్పించారు కోహ్లీకి ఏకంగా రూ.21 కోట్లతో రిటైనర్‌గా ముద్రించారు, రెండవ రిటైనర్‌గా రజత్ పాటిదార్‌ను ఎంపిక చేశారు, అతనికి రూ.11 కోట్లు కేటాయించారు అలాగే మూడవ ఆటగాడు యశ్ దయాల్‌ను రూ.5 కోట్లకు రిటైన్ చేశారు మొత్తంగా ఈ ముగ్గురు ఆటగాళ్ల రిటెన్షన్ కోసం రూ.37 కోట్లు ఖర్చు పెట్టింది.
ఈ ముగ్గురు కీలక ఆటగాళ్లతో పాటు మెగా వేలానికి ముందు ,మరో ముగ్గురు ఆటగాళ్లను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది, దీని కోసం ప్రత్యేకంగా రైట్ టు మ్యాచ్ఎంపికను ఉపయోగించుకోవచ్చు. ఎంపిక ద్వారా ఒక ఆటగాడు వేలంలోకి వచ్చినప్పుడు, అతన్ని తిరిగి తమ జట్టులోకి తీసుకోవడానికి ప్రత్యేక హక్కును ఫ్రాంచైజీ పొందుతుంది. కానీ ఎంపికను అమలు చేయాలంటే, ఆ ఆటగాడు ముందుగా వేలంలోకి వెళ్లాలి, అనంతరం అత్యధిక బిడ్డింగ్ పైన ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకోవచ్చు.
ఉదాహరణకు, మొహమ్మద్ సిరాజ్‌ను విడుదల చేసి ఉంటే, అతనిపై ఎంపిక ఉపయోగించి, వేలంలో సిరాజ్ పై చెన్నై సూపర్ కింగ్స్ రూ.10 కోట్ల వరకు బిడ్డింగ్ చేస్తే, ఆ మొత్తాన్ని చెల్లించడం ద్వారా సిరాజ్‌ను తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఎంపిక ప్రత్యేకత. ప్రస్తుతం మూడు ఎంపికలను వినియోగించుకోవచ్చు, అంటే మెగా వేలానికి ముందు 6 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అనుమతి ఉంది. ప్రస్తుతం ముగ్గురిని మాత్రమే రిటైన్ చేసిన మిగిలిన స్థానాల్లో ఎంపికను ఉపయోగించి జట్టును మరింత బలోపేతం చేసే అవకాశముంది.