Nora Fatehi:ఐటెమ్స్ సాంగ్స్ కు సినిమాల్లో మంచి క్రేజ్  ఉంది.

nora fatehi

సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్‌కి మంచి క్రేజ్ ఉంటుందని అందరికీ తెలిసిందే. ఈ పాటల్లో నటించేవారు తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంటారు అలా బాలీవుడ్ నటి నోరా ఫతేహి కూడా “దిల్‌బర్” అనే ఐటెమ్ సాంగ్‌తో బాగా ప్రాచుర్యం పొందింది అయితే ఈ పాట కోసం తాను వేసుకునే డ్రెస్ మరీ పొట్టిగా ఉండటంతో మొదట ఈ పాట చేయడానికి తాను సిద్ధంగా లేనని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది కెనడియన్ యాక్ట్రెస్ మరియు డ్యాన్సర్ అయిన నోరా ఫతేహి తన అందం మరియు డ్యాన్స్ మూమెంట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. “దిల్‌బర్” పాట గురించి ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ 2024లో నోరా తన అనుభవాలను పంచుకుంది. ముఖ్యంగా ఈ పాటలో తన కాస్ట్యూమ్‌పై ఆమె కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలిపింది.

“సినిమా మేకర్స్‌తో మాట్లాడినప్పుడు, నేను వారికి ఒకే ఒక్క విషయాన్ని చెప్పాను – ఇది ఒక ఐటెమ్ సాంగ్ అయినా, దాన్ని చాలా హాట్ అండ్ సెక్సీగా కాకుండా, ఎక్కువగా డ్యాన్స్ ఆధారంగా రూపొందించవచ్చు. ఏ విధమైన సెటింగ్స్ లేదా డ్రెస్సింగ్ కంటే, పాటను ఏవైనా కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా చూడగలిగేలా చేయాలని కోరుకున్నాను. పాటలో కొరియోగ్రఫీపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరాను,” అని ఆమె చెప్పింది నోరా తన అభ్యంతరాలను వినిపించిన తర్వాత, ఫిల్మ్ టీమ్ ఆమె కోసం కొత్త కాస్ట్యూమ్‌ని అందించింది. “ఆ మొదటి కాస్ట్యూమ్‌ మరీ చిన్నగా ఉంది, కాబట్టి మరీ సెక్సువలైజ్ చేయకుండా, మర్యాదగా కనిపించేలా కాస్ట్యూమ్‌ని మార్చమని కోరాను. చివరికి కొత్త బ్లౌజ్‌తో పాటను పూర్తి చేశాను. అది కూడా కొంచెం చిన్నగానే ఉన్నా, ముందు ఇచ్చిన దానికంటే మెరుగ్గా ఉంది,” అని నోరా వివరించింది ఇటీవల, నోరా బాలీవుడ్‌లో విడుదలైన “మడ్గావ్ ఎక్స్‌ప్రెస్” మూవీలో నటించింది. ఇక త్వరలోనే తెలుగులోనూ అడుగుపెట్టబోతోంది. వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న “మట్కా” మూవీలో నోరా ఫతేహి కనిపించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest sport news. Whаt wіll іt tаkе tо turn the tіdе ?. Us military airlifts nonessential staff from embassy in haiti.