మనం ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే వాటర్ బాటిల్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. కానీ, చాలా మంది బాటిల్‌ను సరిగ్గా శుభ్రం చేయరు. మౌత్ చిన్నగా ఉన్నప్పుడు లోపల మురికి వదలదు. ఇది బ్యాక్టీరియా పెరిగే ప్రమాదాన్ని పెంచుతుంది. మీరు వాటర్ తప్పనిసరిగా వారానికి ఒక్కసారైనా డీప్ క్లీన్ చేయాలి. పాలు లేదా పెరుగు తీసుకెళ్తే ప్రతిరోజూ శుభ్రం చేయడం మంచిది. రోజూ వాడే బాటిల్‌ను సబ్బు మరియు గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి. ముందుగా బాటిల్‌లో గోరువెచ్చని నీరు పోసి అందులో సబ్బు వేసి బాగా షేక్ చేయండి. తర్వాత బాటిల్ బ్రష్‌తో శుభ్రం చేసి నీటిని పారబోసి ఫ్రెష్ నీటితో నాలుగు సార్లు కడగండి.
బేకింగ్ సోడా బాటిల్‌లోని బ్యాక్టీరియాను చంపుతుంది. బాటిల్‌లో రెండు టీస్పూన్ల బేకింగ్ సోడా వేసి, వేడి నీరు పోసి, మూత పెట్టి షేక్ చేయండి. 10 నిమిషాల పాటు అలానే ఉంచి తర్వాత నీటిని పారబోసి ఫ్రెష్ నీటితో కడగండి.
మీరు వెనిగర్‌తోనూ బాటిల్‌ను శుభ్రం చేయవచ్చు. బాటిల్‌లో వెనిగర్ వేసి, వేడి నీటితో నింపండి. దీన్ని 15 నిమిషాల పాటు అలానే ఉంచి మంచి నీళ్ల తో శుభ్రం చేయండి.