Merrill was the pm modi who launched their advanced manufacturing facility under the PLI scheme

పిఎల్‌ఐ పథకం కింద మెరిల్ వారి అధునాతన తయారీ ప్రాంగణాన్ని ప్రారంభించిన ప్రధాని

గుజరాత్ : భారతదేశంలో అగ్రగామి గ్లోబల్ మెడ్‌టెక్ కంపెనీల్లో ఒకటైన మెరిల్ తమ అత్యాధునిక ఉత్పత్తి ప్రాంగణాలను గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఉత్పత్తి అనుబంధ ప్రోత్సాహక (పిఎల్ఐ) పథకం కింద వర్ట్యువల్‌గా ప్రారంభించడంతో మరో గణనీయమైన మైలురాయిని వేడుక చేసుకుంది. వాపిలోని మెరిల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ ప్రారంభోత్సవానికి గుజరాత్ గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ భూపేందర్‌భాయ్ పటేల్ హజరయ్యారు.

ప్రముఖ వైద్య పరికరాల ఉత్పత్తిదారు, తయారీదారు అయిన మెరిల్ వైద్య సాంకేతికతలో దేశ సామర్థ్యాన్ని ప్రదర్శించడం ద్వారా అంతర్జాతీయంగా భారతదేశం ఉనికిని విస్తరించింది. అత్యున్నత నాణ్యత కలిగిన ‘మేక్ ఇన్ ఇండియా’ పరికరాల ఉత్పత్తితో విదేశీ దిగుమతులపై భారతదేశం ఆధారపడడాన్ని క్రియాశీలకంగా తగ్గిస్తోంది, అమృత్ భారత్ దార్శనికతకు మద్దతునిస్తోంది.

2024 వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌లో, వైద్య పరికరాల రంగంలో రూ. 910 కోట్ల కొత్త పెట్టుబడులకు కట్టుబడే విధంగా గుజరాత్ ప్రభుత్వంతో ఒక మెమొరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ (ఎంఓయు) మీద మెరిల్ సంతకం చేసింది. ఈ రోజు వరకూ, మెరిల్ పెట్టిన రూ. 1,400 కోట్లకు పైగా పెట్టుబడులు భారతీయ మెడ్‌టెక్ పర్యావరణ వ్యవస్థపై ఈ సంస్థ నిబద్ధతను చాటిచెబుతున్నాయి. ఈ పెట్టుబడి 5,000 ఉద్యోగాలను సృష్టిస్తూ, కీలకమైన వైద్య పరికరాల దిగుమతులను గణనీయంగా తగ్గించడానికి దోహదం చేస్తాయని ఆశిస్తున్నారు. పిఎల్ఐ పథకం కింద మెరిల్ గ్రూప్‌లోని నాలుగు కంపెనీలు స్ట్రక్చరల్ హార్ట్, వాస్క్యులర్ ఇంటర్వెన్షన్స్, ఆర్థోపెడిక్స్ మరియు ఎండో సర్జరీలతో సహా కార్యకలాపాలు సాగిస్తున్నాయి, ఆవశ్యకమైన పరికరాలను దేశీయంగా ఉత్పత్తి చేయడానికి దోహదపడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Bahas 2 agenda penting, pjs wali kota batam hadiri rapat paripurna dprd kota batam. Baby bооmеrѕ, tаkе it from a 91 уеаr оld : a lоng lіfе wіth рооrеr hеаlth іѕ bаd nеwѕ, аnd unnесеѕѕаrу. Latest sport news.