ప్రేమ మితిమీరితే

saree rgv movie

రామ్ గోపాల్ వర్మ తన తాజా థ్రిల్లర్ ‘శారీ’ ని విడుదల చేసాడు, ఇది మనసు గిల్చే థ్రిల్లర్‌గా రూపొందింది. ఆర్జీవీ డెన్ ద్వారా నిర్మించిన ఈ చిత్రం “టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో వస్తుంది, ఇది వివిధ నిజజీవిత సంఘటనలను కలిపి ఒక అస్వస్థతకు గురి చేసే కథను రూపొందిస్తుంది. కృష్ణకమల్ దర్శకత్వంలో, ఈ చిత్రాన్ని ఆర్జీవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బిజినెస్‌మాన్ రవి వర్మ నిర్మించాడు. సత్య యాదు మరియు ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 20 న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ చిత్రం థియేట్రికల్ హక్కులను వెంకట సాయి ఫిలిమ్స్ ద్వారా ముత్యాల రాందాస్ అనుకున్న ఫ్యాన్సీ రేటుతో సొంతం చేసుకున్నారు.

ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, “ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా భయంకరమైన సంబంధాలను తెర పైకి తీసుకువస్తోంది. ఇది జనానికి మేలు చేయకుండా ‘యాంటీ సోషియల్ మీడియా’గా మారుతోంది. ఇన్స్టాగ్రామ్ వంటి యాప్ల వల్ల చాలామందిలో విచ్ఛిన్నత్వం పెరిగిపోతుంది, యువతులు వాటిలోని నిజాలను అర్థం చేసుకోకుండా ఆకర్షితులవుతారు” అని చెప్పారు. ఈ చిత్రంలో మితిమీరిన ప్రేమ ఎంత భయంకరంగా మారొచ్చనే అంశాన్ని ప్రధానంగా ప్రదర్శించబోతున్నామని చెప్పారు. “వయసులో ఉన్న అమ్మాయిలకు కనువిప్పు కలిగించేలా ఈ సినిమా రూపొందించారు” అని ఆయన అన్నారు. అంతేకాకుండా, ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రక్రియతో రికార్డ్ చేసిన ‘ఐ వాంట్ లవ్’ అనే లిరికల్ ఫుల్ వీడియో సాంగ్‌ను ఆర్జీవీ డెన్ మ్యూజిక్ ద్వారా విడుదల చేశాం, దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో మరో లిరికల్ సాంగ్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

డిసెంబర్ 20న ‘శారీ’ చిత్రం నాలుగు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest sport news. Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Russians stage a rare protest after a dam bursts and homes flood near the kazakh border.