brs leaders visited gangula

గంగుల కమలాకర్‌ను పరామర్శించిన బీఆర్‌ఎస్ లీడర్స్

కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, జోగు రామన్న తదితరులు పరామర్శించి, ఆయన మాతృమూర్తి గంగుల లక్ష్మీ నర్సమ్మ మరణానికి నివాళులు అర్పించారు. గురువారం కరీంనగర్‌లో గంగుల కమలాకర్ నివాసానికి వెళ్లి, లక్ష్మీ నర్సమ్మ(85) చిత్ర పటానికి పూలమాలలు వేసి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

గంగుల లక్ష్మీ నర్సమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం ఉదయం కరీంనగర్‌లోని గంగుల నివాసంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. నివాళులు అర్పించిన వారిలో మాజీ మంత్రులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, జోగు రామన్న, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యేలు డా. గాదరి కిశోర్ కుమార్, ఎన్ భాస్కర్ రావు, పైళ్ల శేఖర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, కోరుకంటి చందర్, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ విజయ, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ తదితరులు ఉన్నారు. ఈ సందర్శనతో గంగుల కమలాకర్‌కు మద్దతు మరియు కుటుంబానికి సంఘీభావం చాటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Batam semakin indah, bp batam bangun bundaran punggur. But іѕ іt juѕt an асt ?. Exciting news for cricket fans ! the lanka premier league 2023 (lpl 2023) is making a big leap by broadcasting its.