మరోసారి తన గొప్ప మనసును చాటుకున్న కేటీఆర్

మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR) మనవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. గురువారం.. సిరిసిల్ల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కేటీఆర్, జిల్లెల్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని తన ఎస్కార్ట్ వాహనంలో సిరిసిల్ల ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.

అంబులెన్స్ వచ్చేందుకు సమయం పడుతుందని అంచనా వేసి, క్షతగాత్రులను సకాలంలో ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నారు. ఆయన స్పందనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చుసిన వారంతా కేటీఆర్‌ను ప్రశంసించారు.

ఆక్సిడెంట్‌లో తీవ్ర గాయాలైన వారిని తన ఎస్కార్ట్ వాహనంలో హాస్పిటల్‌కు పంపిన కేటీఆర్

కేటీఆర్‌ సిరిసిల్ల నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా మార్గమధ్యలో జిల్లెల్ల వద్ద ఓ యాక్సిడెంట్‌లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

గమనించిన కేటీఆర్‌ అంబులెన్స్ వచ్చే వరకు సమయం పడుతుందని, తన ఎస్కార్ట్… pic.twitter.com/GaXPP5DUtU— Telugu Scribe (@TeluguScribe) October 25, 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This will close in 10060 seconds