కోలీవుడ్ స్టార్ అజిత్ పేరు పరిచయం అక్కర్లేని విషయం. ప్రస్తుతం అజిత్, త్రిష కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా కోలీవుడ్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన ఓ పెద్ద రూమర్ హల్‌చల్ చేస్తోంది. ఆ వార్త ఏంటంటే, త్రిష ఈ సినిమా షూటింగ్ నుండి తప్పుకుందని, ఆ కారణం అజిత్‌తో గొడవ అని వినిపిస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
త్రిష ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్న టాప్ హీరోయిన్లలో ఒకరు. గుడ్ బ్యాడ్ అగ్లీ , విశ్వంభర , విడాముయర్చి , థగ్ లైఫ్ వంటి పలు ప్రాజెక్టుల్లో త్రిష నటిస్తోంది. అజిత్‌తో కలిసి త్రిష ప్రస్తుతం స్పెయిన్‌లో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా షూటింగ్‌లో ఉన్నట్లు సమాచారం. కానీ, ఉన్నట్టుండి త్రిష చెన్నైకి తిరిగి రావడంతో కోలీవుడ్ మీడియాలో పెద్ద రూమర్లు మొదలయ్యాయి. అజిత్‌తో జరిగిన గొడవ వల్లే త్రిష ఆ సినిమాను వదిలేసిందనే వార్తలు తెగ వినిపిస్తున్నాయి.
నెటిజన్లు కూడా ఈ రూమర్లపై తెగ చర్చించుకుంటూ, “త్రిష నిజంగానే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా నుండి తప్పుకుందా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, మరోపక్క కోలీవుడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, త్రిష అజిత్‌తో ఎలాంటి గొడవలు జరగలేదని, ఆమె స్పెయిన్ నుండి చెన్నైకి రావడానికి మరో కారణం ఉందని చెబుతున్నారు. త్రిష ఒక నగల ప్రకటన కోసం మాత్రమే చెన్నైకి వచ్చిందని కొందరు అంటున్నారు. అయినప్పటికీ, ఆమె అకస్మాత్తుగా స్పెయిన్ వదిలి చెన్నైకి రావడంతో ఈ రూమర్లు మరింత ఉధృతంగా మారాయి అయితే అధికారిక ప్రకటన రాకముందు, ఈ రూమర్లలో ఎంతవరకు నిజం ఉందనేది చెప్పడం కష్టం అయినప్పటికీ, త్రిష తన వర్క్ షెడ్యూల్ ప్రకారం సినిమాలను పూర్తి చేస్తుందని, ఈ రూమర్లు కేవలం ప్రచారం మాత్రమే కావచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.