టీమిండియా స్టార్ పేసర్ మరియు తెలంగాణ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ భారత జట్టులోంచి స్థానాన్ని కోల్పోయాడు. పుణె వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌కు టీమ్ మేనేజ్‌మెంట్ సిరాజ్‌ను తుది జట్టులోకి తీసుకోలేదు బెంగళూరులో జరిగిన తొలి టెస్ట్‌లో ఆయన ప్రదర్శన తీవ్రంగా విఫలమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు సిరాజ్ ఆ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు మాత్రమే తీయగా రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం వికెట్ లేకుండానే ముగించాడు ఈ కారణంగా సిరాజ్ స్థానంలో యువ పేసర్ ఆకాశ్‌దీప్‌కు అవకాశాన్ని కల్పించారు ఈ మార్పు మాత్రం ఆశ్చర్యకరం కాదు ఎందుకంటే ఇటీవల సొంత గడ్డపై సిరాజ్ ప్రదర్శన నిరాశకు గురిచేసింది ఈ ఏడాది సిరాజ్ తన ఫామ్‌ను పూర్తిగా కోల్పోయినట్లు కనిపిస్తుంది టెస్ట్ ఫార్మాట్‌లో అతని గణాంకాలు కూడా నిరాశపరిచాయి సిరాజ్ ప్రదర్శనలో పతనం కనిపించడానికి ప్రధాన కారణం అతను దేశవాళీ క్రికెట్ ఆడకపోవడమేనని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తరచుగా సిరాజ్‌కు అంతర్జాతీయ క్రికెట్ నుంచి విశ్రాంతి ఇవ్వడం దేశవాళీ మ్యాచ్‌లు ఆడకపోవడంతో అతను తన రిథమ్ కోల్పోయాడని విమర్శకులు అంటున్నారు ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్ట్‌ల సిరీస్‌లోనూ సిరాజ్ పెద్దగా ప్రభావం చూపలేదు నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీసిన సిరాజ్ సొంత గడ్డ అయిన హైదరాబాద్ వేదికలో కూడా వికెట్ల వేటలో వెనుకబడ్డాడు వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌కు విశ్రాంతి తీసుకున్న సిరాజ్ మళ్లీ రాంచీ టెస్ట్‌లో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసాడు ధర్మశాల టెస్ట్‌లో మాత్రం వికెట్ లేకుండానే తన స్పెల్‌ను ముగించాడు బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లోనూ సిరాజ్ నిరాశపరిచాడు ఇదిలా ఉంటే ఆకాశ్‌దీప్ దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనతో టీమ్‌ఇండియాలోకి వచ్చాడు ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీలో 9 వికెట్లు సాధించిన ఆకాశ్‌దీప్ బంగ్లాదేశ్ సిరీస్‌లోనూ తన ప్రతిభను చూపి జట్టులో చోటు దక్కించుకున్నాడు.