ఏపీ సీఎం చంద్రబాబు ఇంటి వద్ద భారీ కొండచిలువ ఒకటి కలకలం రేపింది. ఉండవల్లిలోని సీఎం నివాసం సమీపంలోని మీడియా పాయింట్ వద్ద ఇది కనిపించింది.
ఈ కొండచిలువ, ఏదో జంతువును మింగిన తర్వాత జీర్ణించుకోలేక చనిపోయిందని తెలుస్తోంది. భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు దానిని అక్కడి నుంచి తొలగించారు. ఇంత భారీ కొండచిలువ ఇంటి సమీపంలోకి ఎలా వచ్చి ఉంటుందని అంత మాట్లాడుకుంటున్నారు.