టాలీవుడ్‌లో ఎప్పటినుంచో టాప్ టాపిక్ గా నిలుస్తున్న విషయం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా స్టార్ హీరో ప్రభాస్ స్టార్ హీరోయిన్ అనుష్క మధ్య పెళ్లి పుకార్లే వీరి మధ్య ప్రేమాయణం నడుస్తుందంటూ గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు హాట్ హాట్‌గా వైరల్ అవుతున్నాయి మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ప్రభాస్ పెళ్లి గురించి వచ్చిన వార్తలు మరింత వేడిని తెచ్చాయి ప్రభాస్ పెళ్లి గురించి ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి ఈ సంవత్సరం మంచి వార్త వినిపిస్తుందని హింట్ ఇచ్చిన దగ్గర నుంచి రెబల్ స్టార్ అభిమానులు ఈ వార్త కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఇప్పుడు ఈ సంవత్సరానికి ఇంకా 60 రోజులు మాత్రమే మిగిలి ఉండటంత ప్రభాస్ తన సీక్రెట్‌ను బయటపెట్టాల్సిన సమయం దగ్గరపడింది.
కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది ఒక డాక్టర్‌ని అదీ తన సొంత మరదలని అని వినిపిస్తోంది ఈ డాక్టర్ భీమవరం ప్రాంతానికి చెందిన అమ్మాయి అని ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చితార్థం కూడా ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తోంది అయితే చాలా మంది ప్రభాస్ – అనుష్క పెళ్లి ఖాయమని బలంగా నమ్మినా ఈ మధ్య కాలంలో ఆ వార్తలు తారుమారవుతున్నాయి ఇప్పటికే అనుష్కతో ప్రభాస్ పెళ్లి జరుగుతుందని వచ్చిన పుకార్లను ఫ్యాన్స్ ఆమోదిస్తూ వస్తున్నారు కానీ తాజా పరిణామాలతో అనుష్కను పెళ్లి చేసుకోవడం లేదన్న వార్తలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఫైనల్‌గా ప్రభాస్ తన సొంత మరదలనే పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తుండటం ఫ్యాన్స్‌కి పెద్ద షాక్ లా మారింది ఎప్పటినుంచో ప్రభాస్ – అనుష్క పెళ్లి జరగాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నా అది నిజం కాకపోవడం వారి మనసులో నిరాశను మిగిలించింది.