తన చెల్లి షర్మిల, తల్లి విజయమ్మపై వేసిన పిటిషన్ నేపథ్యంలో టీడీపీ చేస్తున్న విమర్శలపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తన చెల్లి షర్మిల మరియు తల్లి విజయమ్మపై జగన్ వేసిన పిటిషన్ నేపథ్యంలో టీడీపీ చేస్తున్న విమర్శలకు సూటిగా స్పందించారు.
“ఇవన్నీ అన్ని ఇళ్లలో ఉండేవే. కుటుంబ వ్యవహారాలను రాజకీయం చేస్తారా?” అని జగన్ ప్రశ్నించారు. “చంద్రబాబు ..మా తల్లి, చెల్లి, నా ఫొటోలు పెట్టి డైవర్ట్ చేస్తున్నారు. అయ్యా చంద్రబాబు.. మీ ఇళ్లలో ఇలాంటి గొడవలు లేవా?” అంటూ విమర్శించారు. “వీటిని నీ స్వార్థం కోసం పెద్దవి చేసి చూపించడం మానుకొని, ప్రజాసమస్యలపై దృష్టి సారించండి” అని పేర్కొన్నారు.