బెంగళూరు వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుతమైన ప్రదర్శనతో తన బ్యాటింగ్ సత్తాను మరోసారి చాటాడు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో సెంచరీ కోల్పోయిన పంత్ 99 పరుగుల వద్ద కివీ పేసర్ విలియం ఓ రూర్క్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు బంతి బ్యాట్ అంచును తాకి స్టంప్స్‌కు తగలడంతో పంత్ ఇన్నింగ్స్ ముగిసింది అయినప్పటికీ అతని ఇన్నింగ్స్ మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ఈ ఇన్నింగ్స్‌కి ముందు పంత్‌కి మోకాలి గాయం కావడంతో రెండో రోజు ఆటలో అతను మైదానాన్ని వీడాల్సి వచ్చింది మూడో రోజు ఫీల్డింగ్‌కి తిరిగి రాకపోవడంతో అతని బ్యాటింగ్ సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి కానీ ఆ అనుమానాలను పంత్ పూర్తిగా త్రోసిపుచ్చాడు తన గాయాన్ని లెక్క చేయకుండా బ్యాటింగ్‌లో తన మార్క్ ఆటతీరును ప్రదర్శించాడు. భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌ను కాపాడుతూ పంత్ తన పాత్రను సమర్థవంతంగా పోషించాడు.
పంత్ కేవలం వికెట్‌ను కాపాడుకోవడమే కాదు పరుగులను కూడా వేగంగా సాధించాడు. అతను 105 బంతుల్లోనే 99 పరుగులు సాధించడంతో టీమిండియా ఇన్నింగ్స్‌కు గణనీయమైన ప్రోత్సాహం లభించింది అతని బ్యాటింగ్‌లో ముఖ్యంగా నాలుగు సిక్సర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి వాటిలో ఒక సిక్సర్ మరపురానిది కివీస్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ బౌలింగ్‌లో పంత్ బలంగా బాదిన ఈ బంతి ఏకంగా 107 మీటర్ల దూరం ప్రయాణించింది ఇది స్టేడియంలోని పైకప్పుకు తగిలి దిగడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది ఈ అద్భుత సిక్సర్ షాట్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా అది చాలా వేగంగా వైరల్‌గా మారింది. అభిమానులు ఈ సిక్సర్‌ను అద్భుతంగా ప్రశంసిస్తున్నారు పంత్ ఇన్నింగ్స్ అతని ఆత్మవిశ్వాసాన్ని దూకుడును మరోసారి చూపించింది. ఈ ఇన్నింగ్స్ ద్వారా భారత జట్టుకు మంచి స్థితిని కల్పించిన పంత్ మ్యాచ్ ఫలితంపై కీలక ప్రభావం చూపాడు.