ఎట్టకేలకు గ్లాడియేటర్ 2 విడుదల తేదీ ఖరారైంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న హాలీవుడ్ హిస్టారికల్ యాక్షన్ మూవీ గ్లాడియేటర్ 2 నవంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ఇండియాలో తెలుగు ఇంగ్లీష్ తమిళ హిందీ వంటి భాషల్లో విడుదల అవుతోంది, అనేక భాషల్లో విడుదల కావడం వల్ల విభిన్న ప్రేక్షక వర్గాలకు మరింత చేరువ కానుంది గ్లాడియేటర్ 2 ఓ సాధారణ సినిమా మాత్రమే కాదు — ఇది ఓ అద్భుతమైన అనుభవం ఈ చిత్రం 4డీఎక్స్ మరియు ఐమాక్స్ ఫార్మాట్లలో విడుదల అవుతోంది ఇది ప్రేక్షకులను ప్రతి ఘట్టంలోనూ మరింత లోతుగా నింపుతుంది ఆధునిక సాంకేతికతతో రూపొందించిన సౌండ్ ఎఫెక్ట్స్ వాస్తవికమైన విజువల్స్ ప్రేక్షకులను నేరుగా యుద్ధ భూమికి తీసుకువెళ్లి రోమ్ చరిత్రను ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతిని కలిగిస్తాయి 2000లో విడుదలైన గ్లాడియేటర్ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కుతున్న గ్లాడియేటర్ 2 భారీ స్థాయిలో నిర్మించబడుతోంది ఈ సినిమా కోసం 310 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు ₹2500 కోట్లు) ఖర్చు చేస్తున్నారు ఈ సీక్వెల్‌ను లెజెండరీ డైరెక్టర్ రిడ్లీ స్కాట్ తెరకెక్కిస్తున్నాడు గొప్ప విజువల్ స్టోరీ టెల్లింగ్‌లో అనుభవం ఉన్న రిడ్లీ మరో సారి ఓ అద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు ఈ సినిమాలో పాల్ మెస్కల్ పెడ్రో పాస్కల్ డెంజిల్ వాషింగ్టన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు గ్లాడియేటర్ 2 ట్రైలర్ విడుదలైన వెంటనే ప్రేక్షకులను తెగ ఉత్సాహపరిచింది. ట్రైలర్‌లో చూపించిన విజువల్స్ అద్భుతంగా ఉండగా, యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకుల మనసులను కట్టిపడేస్తున్నాయి. లూసియస్ అనే ప్రధాన పాత్ర తనను బంధించిన రోమ్ చక్రవర్తులపై ప్రతీకారం తీర్చుకునే క్రమంలో మాక్రిసన్ తో కలిసి చేసిన ప్రయాణాన్ని దర్శకుడు రిడ్లీ స్కాట్ చూపించాడు యుద్ధ సన్నివేశాల మధ్యలో రోమ్ సామ్రాజ్యంలో అధికారం కోసం జరిగిన కుట్రలు చక్రవర్తిపై లూసియస్ ప్రతీకారం తీర్చుకునే కథ అద్భుతంగా రూపొందించారు
2000లో విడుదలైన గ్లాడియేటర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘన విజయాన్ని సాధించింది ఈ సినిమా ఐదు ఆస్కార్ అవార్డులను గెలుచుకోవడంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇరవై నాలుగు ఏళ్ల తర్వాత ఈ క్లాసిక్ మూవీకి సీక్వెల్‌గా రాబోతున్న గ్లాడియేటర్ 2 పై సినీ ప్రేమికుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది ఈ సీక్వెల్ కథ కూడా మొదటి భాగానికి కొనసాగింపుగా ఉంటుందని మేకర్స్ ప్రకటించారు అంతే కాకుండా దర్శకుడు రిడ్లీ స్కాట్ గ్లాడియేటర్ తర్వాత గ్లాడియేటర్ 3 ను కూడా తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించాడు 2001 నుంచే ఈ సీక్వెల్ గురించి రిడ్లీ స్కాట్ ప్రయత్నాలు చేస్తున్నాడు ఇప్పుడు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ అద్భుతమైన కథకు కొనసాగింపుగా మరో గొప్ప అనుభవాన్ని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు ఈ నవంబర్ 15న గ్లాడియేటర్ 2 సినిమా విడుదల కానుండటంతో ప్రేక్షకులు మరోసారి రోమ్ చరిత్రను తెరపై చూడటానికి సిద్ధమవుతున్నారు!