ఆరోగ్యమైన జుట్టు కోసం కొన్ని చిట్కాలు

Hair care

జుట్టు ని ఆరోగ్యంగా ఉంచాలంటే కొన్ని చిట్కాలు పాటించడం అవసరం. మొదటగా, సరైన శాంపూ మరియు కండీషనర్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీ జుట్టు ఎలాంటి రకమో తెలుసుకుని దానికి అనుగుణంగా వాటిని ఎంచుకోవాలి. ఉదాహరణకు చుండ్రు వంటి సమస్యలు ఉన్నట్లయితే వాటికి సంబంధిచిన ప్రత్యేక శాంపూలు ఉపయోగించడం మంచిది. మరియు కండీషనర్ కూడా జుట్టు కి చాల ఉపయోగపడుతుంది . ఇది జుట్టు యొక్క
మృదువుతనం పెరగడానికి అవసరం. జుట్టుపై ఎక్కువ ఉత్పత్తులు ఉపయోగించకుండా సహజ పద్ధతులను పాటించడం మంచిది. సరైన డైట్ కూడా జుట్టు ఆరోగ్యానికి కీలకంగా ఉంటుంది.

జుట్టు ని ఆరోగ్యంగా ఉంచడం కోసం పాటించాల్సిన కొన్ని చిట్కాలు :

1.ప్రతిరోజు తలస్నానం చేయకండి. మూడురోజులకు ఒకసారి శాంపూ తో తలస్నానం చేయడం సరిపోతుంది. ఇది జుట్టుకు అవసరమైన నూనెను కాపాడుతుంది.

  1. ప్రోటీన్స్, విటమిన్స్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. మామిడి, కివి, ఉల్లిపాయలు, కరివేపాకు మరియు పండ్లు తీసుకోవడం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని పెంచవచ్చు.
  2. శరీరానికి సరిపడా నీరు తాగడం వల్ల జుట్టు హైడ్రేటెడ్‌గా ఉంటుంది . కాబట్టి రోజు కనీసం 8-10 గ్లాసులు నీరు తాగడం మంచిది .
  3. ఎక్కువ సమయం బయట ఉంటే, జుట్టుకు ఎండ వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది .
  4. మంచిగా నిద్రపోవడం కూడా చాలా ముఖ్యం. రాత్రి పూట మంచిగా నిద్రపోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

ఈ చిట్కాలను అనుసరించి, మీరు మీ జుట్టు ని ఆరోగ్యంగా మరియు అందంగా ఉంచవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *