game changer jpg

సంక్రాంతికి రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’..?

మెగా అభిమానులను మరోసారి నిరాశ పరచబోతుంది గేమ్ ఛేంజర్ టీం. ఇప్పటికే ప్రమోషన్ విషయంలో నిరాశ పరుస్తూ వస్తుండగా…ఇక ఇప్పుడు రిలీజ్ విషయంలో కూడా పెద్ద షాక్ ఇవ్వబోతున్నట్లు వినికిడి. డైరెక్టర్ శంకర్ (Shankar) – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram CHaran) కలయికలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్. దిల్ రాజు నిర్మాణంలో పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటుంది.

మొన్నటి వరకు ఈ మూవీ ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. అభిమానులు కూడా అదే ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు సంక్రాంతికి రిలీజయ్యే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి. క్రిస్మస్కి బదులు సంక్రాంతికి రిలీజ్ చేస్తే సెలవులు కలిసొస్తాయని మేకర్స్ అనుకుంటున్నట్లు తెలిపాయి. జనవరి 10న ఈ చిత్రం రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇక వెంకటేశ్-అనిల్ రావిపూడి మూవీ జనవరి 14న విడుదలవనుండగా, మెగాస్టార్ ‘విశ్వంభర’ ఉగాదికి వచ్చే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Oneplus nord 3 5g unboxing archives brilliant hub. Org/resurrection life in the valley of dry bones ezekiel 371 14/. All the other outlaw motorcycle gangs had been infiltrated, but the hells angels prided themselves on being impenetrable.