రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌ల‌కు ఎమ్మార్పీఎస్ పిలుపు

MMRPS calls for protests ac

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయకుండానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ విమర్శలు గుప్పించారు. మాలలకు అనుకూలంగా ఉంటూ… మాదిగలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ తీరును నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలని పిలుపునిచ్చారు.

రేవంత్ స‌ర్కార్ త‌మ‌కు న‌మ్మ‌క ద్రోహం చేసింద‌ని మందకృష్ణ ధ్వ‌జ‌మెత్తారు. మాదిగ‌ల‌కు సీట్లు త‌గ్గ‌డానికి కూడా రేవంత్ రెడ్డినే కార‌ణం అన్నారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ లేకుండానే ఉద్యోగ నియామ‌కాలు చేప‌డుతున్నారు. అసెంబ్లీలో ప్ర‌క‌టించిన మాదిరిగా.. రేవంత్ రెడ్డి అన్ని ప్ర‌భుత్వ ఉద్యోగ నోటిఫికేష‌న్ల‌లో ఎస్సీ రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయాల‌ని మంద‌కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రాల్లో రేపు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వ‌హించి, ధ‌ర్నా చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రాల్లోని అంబేద్క‌ర్ విగ్ర‌హాల నుంచి క‌లెక్ట‌ర్లేట్ల వ‌ర‌కు ర్యాలీలు చేప‌ట్టాల‌న్నారు. అనంత‌రం జిల్లాల్లో క‌లెక్ట‌ర్ల‌కు విన‌తిప‌త్రాలు అందించాలని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

He had nо іntеrеѕt іn the еxіѕtіng rulеѕ оf thе gаmе. Latest sport news. ©2023 brilliant hub.