వైసీపీ అధినేత జగన్ కు వరుస షాకులు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నేతలంతా రాజీనామా చేస్తూ టీడీపీ , జనసేన లలో చేరుతున్నారు. ఇప్పటికే కీలక నేతలు జాయిన్ కాగా…ఇప్పుడు కిందిస్థాయి నేతలు చేరుతున్నారు. తాజాగా కమలాపురం పురపాలక సంఘంలోని వైసీపీ నేతలు…టీడీపీ లో చేరారు.పురపాలక ఛైర్మన్ మర్పూరి మేరీ, కౌన్సిలర్లు షేక్‌నూరి, రాజేశ్వరి, సలీల, నాగమణి సోమవారం టీడీపీలో చేరారు.
ఇదివరకే కొందరు కౌన్సిలర్లు చేరగా తాజాగా చేరిన వారితో కలుపుకొని టీడీపీ సంఖ్యా బలం 10కి పెరిగింది. ఫలితంగా వైసీపీ సంఖ్యా బలం 8కి తగ్గింది. దీంతో కమలాపురం పురపాలక పీఠం దాదాపు అధికార పార్టీ వశమైనట్టే. త్వరలో జరిగే పురపాలక సర్వసభ్య సమావేశంలో ఛైర్మన్‌ను ఎన్నుకునే అవకాశాలున్నాయి. ఈ మేరకు టీడీపీ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామంతో కమలాపురం వైసీపీ శాసనసభ్యుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి భారీ షాక్ తగిలినట్టు అయ్యింది.