జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న తుది దశ పోలింగ్‌

final phase of voting is ongoing in Jammu and Kashmir
final phase of voting is ongoing in Jammu and Kashmir

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటికే రెండు దశలు ముగియగా ఈరోజు చివరి దశ పోలింగ్‌ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్‌ ప్రారంభమైన రెండు గంటల వ్యవధిలోనే 11 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఉదయం 9 గంటల వరకూ 11.60 శాతం మేర పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

అత్యధికంగా ఉధమ్‌పూర్‌లో 14.23 శాతం పోలింగ్‌ నమోదుకాగా.. అత్యల్పంగా బారాముల్లాలో 8.89 శాతం నమోదైనట్లు తెలిపారు. బందిపొరలో 11.64 శాతం, జమ్మూలో 11.46 శాతం, కథువాలో 13.09 శాతం, కుప్వారాలో 11.27 శాతం, సాంబలో 13.31 శాతం మేర ఓటింగ్‌ నమోదైనట్లు వెల్లడించారు.

మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది. ఆఖరి దశలో 40 నియోజకవర్గాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. జమ్మూలో 11, సాంబలో 3, కథువాలో ఆరు, ఉధమ్‌పూర్‌లో 4, బారాముల్లాలో 7, బందిపొరలో 3, కుప్వారాలో 6 నియోజకవర్గాలకు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగుతున్నది. మొత్తం 39.18 లక్షల మంది ఓటర్ల కోసం 5060 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు.

20 వేల మందితో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత ఓటుహక్కు పొందిన పశ్చిమ పాకిస్థాన్‌ శరణార్థులు, వాల్మీకి సమాజ్, గూర్ఖా తెగలు మొదటిసారిగా ఓటు వేయనున్నారు. సెప్టెంబర్ 18న జరిగిన మొదటి దశలో 61.38 శాతం, అదేనెల 26న జరిగిన రెండో దశలో 57.31 శాతం పోలింగ్ నమోదయింది. ఈ నెల 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ స్థానాల్లో ఇద్దరు డిప్యూటీ సీఎంలు సహా 415 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్, మాజీ మంత్రి సజ్జాద్ లోన్, నేషనల్ పాంథర్స్ పార్టీ ఇండియా అధ్యక్షుడు దేవ్ సింగ్‌లు మూడో దశ ఎన్నికల బరిలో ఉన్నారు. కుప్వారా నుంచి సజ్జాద్‌ లోన్ పోటీ చేస్తుండగా, ఉధంపూర్‌లోని చెనాని స్థానంలో దేవ్‌ సింగ్ బరిలో నిలిచారు. అదేవిధంగా జమ్ముకశ్మీర్ మాజీ మంత్రులు రమణ్ భల్లా, ఉస్మాన్ మజీద్, నజీర్ అహ్మద్ ఖాన్, తాజ్ మొహియుద్దీన్, బషరత్ బుఖారీ, ఇమ్రాన్ అన్సారీ, గులాం హసన్ మీర్, చౌదరి లాల్ సింగ్ పోటీచేస్తున్నారు.

Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Life und business coaching in wien – tobias judmaier, msc. Latest sport news.